Golden Chariot – Srisailam: శ్రీశైలం మల్లన్నకు బంగారు రథం విరాళం.! 23.6 అడుగుల ఎత్తు.

|

Feb 19, 2024 | 9:03 AM

నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవార్లకు నెల్లూరు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి దంపతులు స్వర్ణరథాన్ని విరాళంగా అందజేశారు. ఆలయ అర్చకులు, వేదపండితులు స్వర్ణరథానికి ఆలయ రాజగోపురం వద్ద సంప్రోక్షణ, ప్రారంభోత్సవ ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి అనంతరం ప్రధానాలయం నుంచి నందిగుడి వరకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు ఈ స్వర్ణరథ సమర్పణ కార్యక్రమంలో దేవదాయశాఖ..

నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవార్లకు నెల్లూరు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి దంపతులు స్వర్ణరథాన్ని విరాళంగా అందజేశారు. ఆలయ అర్చకులు, వేదపండితులు స్వర్ణరథానికి ఆలయ రాజగోపురం వద్ద సంప్రోక్షణ, ప్రారంభోత్సవ ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి అనంతరం ప్రధానాలయం నుంచి నందిగుడి వరకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు ఈ స్వర్ణరథ సమర్పణ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు. ఈ బంగారు రథం విలువ 11 కోట్ల రూపాయిలు ఉంటుందని దాతలు వెల్లడించారు. 23.6 అడుగుల ఎత్తుతో తయారు చేసిన స్వర్ణరథం మధ్యలో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, కుమారస్వామి మూర్తులు, దిగువ భాగంలో బ్రహ్మమూర్తులు కొలువై ఉన్నారు. అయితే శ్రీశైల దేవస్థానానికి ఇప్పటికి వరకు వెండి రథోత్సవం మాత్రమే ఉండేది అది కూడా సోమవారం శ్రీస్వామి అమ్మవార్లకు ఆలయంలో వెండి రథోత్సవం నిర్వహించేవారు. ఇకపై శ్రీ స్వామి అమ్మవార్లు స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..