Cafe Coffee day: గొప్ప వ్యాపారవేత్త.. నేత్రావతి నదిలో శవమై తేలాడు.. డెత్‌ మిస్టరీపై త్వరలో సినిమా..

|

Jun 23, 2022 | 9:52 AM

ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రముఖుల బయోపిక్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ వ్యాపారవేత్త జీవితాన్ని తెరపై చూపించబోతున్నారు. అతడే ప్రముఖ బిజినెస్ మేన్ కేఫ్ కాఫీ డే


ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రముఖుల బయోపిక్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ వ్యాపారవేత్త జీవితాన్ని తెరపై చూపించబోతున్నారు. అతడే ప్రముఖ బిజినెస్ మేన్ కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ్.. ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులను జర్నలిస్ట్ లు బీఆర్ రుక్మిణి, ప్రోసెన్‌జిత్ దత్తా కాఫీ కింగ్ పేరుతో ఓ పుస్తకంగా మలిచారు. ఇప్పుడు ఆ బుక్ ఆధారంగా సిద్ధార్థ్ జీవితాన్ని సినిమాగా నిర్మించబోతున్నారు. ఈ చిత్రం హక్కులను టీ సిరీస్, ఆల్ మైటీ మోషన్ పిక్చర్ సంస్థలు కొనుగోలు చేసినట్లు శుక్రవారం ప్రకటించాయి. కేఫ్ కాఫీ డేను ముందుగా చిన్నగా ప్రారంభించి.. ఆ తర్వాత దాని బ్రాంచ్‌లను దేశవ్యాప్తంగా విస్తరించారు వీజీ సిద్ధార్థ్.. వ్యాపారంలో అనేక విజయాలతో దూసుకుపోతున్న ఆయన అనుహ్యంగా కర్ణాటకలోనే నేత్రావతి నదిలో శవమై తేలారు. సిద్ధార్థ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.. వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించి.. తన జీవితంలో అనేక మలుపులు.. అంతలోనే ఆకస్మికంగా మరణం.. ఇలా.. ఆయన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు.. వాటిపై లోతైన పరిశీలనతో రాసిన పుస్తకమే కాఫీ కింగ్.. ది స్విఫ్ట్ రైజ్ అండ్ సడన్ డెత్ ఆఫ్ కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ్.. ఇది కచ్చితంగా వెండితెరపై ఆవిష్కరించాల్సిన కథ.. అందుకే దీని హక్కులు తీసుకున్నాం.. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తాం అంటూ తెలిపాయి సదరు నిర్మాణ సంస్థలు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Follow us on