Leave Letter: ఈ ఉద్యోగి నిజాయితీకి యజమాని షాక్..! వేరే కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్లడానికి..
ధర్మో రక్షతి రక్షితః అంటారు.. మనం ధర్మంగా నిజాయితీగా ఉంటే అదే మనల్ని కాపాడుతుందని పెద్దలు చెబుతుంటారు.. చాలామంది నమ్ముతారు కూడా. అలా తన నిజాయితీని నమ్ముకున్న ఓ ఉద్యోగికి తన బాస్‌కు
ధర్మో రక్షతి రక్షితః అంటారు.. మనం ధర్మంగా నిజాయితీగా ఉంటే అదే మనల్ని కాపాడుతుందని పెద్దలు చెబుతుంటారు.. చాలామంది నమ్ముతారు కూడా. అలా తన నిజాయితీని నమ్ముకున్న ఓ ఉద్యోగికి తన బాస్‌కు రాసిన లీవ్ లెటర్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. తన మెయిల్‌కు వచ్చిన లీవ్ అప్లికేషన్‌ను సాహిల్ అనే వ్యక్తి ట్విటర్‌లో షేర్ చేశాడు.వైరల్ అవుతున్న ఈ లీవ్ లెటర్‌లో ‘ప్రియమైన సర్, గుడ్ మార్నింగ్.. మరొక కంపెనీలో ఇంటర్వ్యూకి హాజరయ్యేందుకు నాకు ఈ రోజు సెలవు అవసరం. దయచేసి నా సెలవును ఆమోదించవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను’ అంటూ రాశాడు. అది చూసి మొదట ఆశ్చర్యపోయిన సాహిల్ అప్లికేషన్‌ను స్క్రీన్‌షాట్ తీసి ట్విటర్‌లో పెట్టగా, వైరల్‌గా మారింది. ‘నా జూనియర్ చూడండి తను వేరే ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు ఎంత స్వీట్‌గా లీవ్ అడుగుతున్నాడో’ అని సాహిల్ ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ఈ లెటర్ చూసినవారంతా ఆ ఉద్యోగి నిజాయతీని మెచ్చుకుంటున్నారు. అలాగే, ఇంత నిజాయతీగా లీవ్ అడిగాడంటే మీరు ఆఫీస్ వాతావరణం ఎలా ఉంచారో అర్థమవుతుందని సాహిల్‌ను కూడా అభినందించారు. మరికొందరు ఫన్నీ లీవ్‌లెటర్లను ట్విటర్‌లో షేర్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

