Gyanvapi: జ్ఞానవాపిలో మరిన్ని నేలమాళిగలు.. ఏఎస్‌ఐ సర్వేలో వెల్లడి!

Gyanvapi: జ్ఞానవాపిలో మరిన్ని నేలమాళిగలు.. ఏఎస్‌ఐ సర్వేలో వెల్లడి!

Anil kumar poka

|

Updated on: Feb 03, 2024 | 6:22 PM

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోగల జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో వ్యాస మహర్షి నేలమాళిగతో పాటు, పలు నేలమాళిగలున్నాయని, వీటిలో నాలుగు నేలమాళిగలను మూసివేశారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన సర్వే నివేదికలో వెల్లడించింది. జీపీఆర్‌ టెక్నాలజీని ఉపయోగించి ASI జరిపిన పరిశోధనలో ప్లాట్‌ఫారమ్ కింద, ప్లాట్‌ఫారమ్ ప్రాంతంలో అనేక బేస్‌మెంట్లు ఉన్నాయని వెల్లడించింది.

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోగల జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో వ్యాస మహర్షి నేలమాళిగతో పాటు, పలు నేలమాళిగలున్నాయని, వీటిలో నాలుగు నేలమాళిగలను మూసివేశారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన సర్వే నివేదికలో వెల్లడించింది. జీపీఆర్‌ టెక్నాలజీని ఉపయోగించి ASI జరిపిన పరిశోధనలో ప్లాట్‌ఫారమ్ కింద, ప్లాట్‌ఫారమ్ ప్రాంతంలో అనేక బేస్‌మెంట్లు ఉన్నాయని వెల్లడించింది. వాటి ఎగువ భాగం తెరిచి ఉండగా, దిగువ భాగమంతా చెత్తతో నిండి ఉందని వాటిని మూసివేసినట్టు పేర్కొంది. . ప్లాట్‌ఫారమ్‌కు నైరుతి భాగంలో చెత్తతో నిండిన మూడు మీటర్ల వెడల్పుగల నేలమాళిగలు ఉండగా, ఒక మీటరు మందపాటి గోడలతో తొమ్మిది చదరపు మీటర్ల పరిమాణంలో ఈ నేల మాళిగలు ఉన్నట్టు నివేదికలో పేర్కొంది. ఈ పెద్ద సెల్లార్లు దక్షిణ గోడ వైపు ప్రవేశద్వారాలను కలిగి ఉన్నాయని, అవి ప్రస్తుతం మూసిఉన్నట్టు పేర్కొంది.

నివేదిక ప్రకారం.. నేలమాళిగకు ఉత్తరం వైపున ఓపెన్ ఫంక్షనల్ తలుపులు ఉన్నాయి. తూర్పు వైపున రెండు మీటర్ల వెడల్పుతో మూడు నుండి నాలుగు నేలమాళిగలు ఉన్నాయి. తూర్పు గోడ మందంలో అనేక మార్పులు ఉన్నాయి. కారిడార్ ప్రాంతానికి ఆనుకుని, ప్లాట్‌ఫారమ్‌కు పశ్చిమ భాగంలో మూడు నుండి నాలుగు మీటర్ల వెడల్పు గల రెండు సెల్లార్లు ఉన్నాయి. నేలమాళిగలో రెండు మీటర్ల వెడల్పు కలిగిన బావి కూడా ఉంది. అలాగే దక్షిణ భాగంలో మరో బావి జాడలు కనిపించాయి. బేస్‌మెంట్ గోడల జీపీఆర్ స్కానింగ్‌లో మూసివున్న బావులు, కారిడార్లు కూడా ఉన్నట్లు తేలిందని నివేదిక పేర్కొంది. దక్షిణ నేలమాళిగ గోడతో కప్పినట్లు ఉందని GPR చూపించింది. ASI తన సర్వే సమయంలో పలు సున్నితమైన వస్తువులను శుభ్రపరచడం, లేబులింగ్ చేయడం, వర్గీకరించడం, పలు పరీక్షలను నిర్వహించడం మొదలైన పనులు చేసింది. ఇందుకోసం అదే ప్రాంగణంలో ప్రాంతీయ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఇది మెటల్‌తో సహా ఇతర పదార్థాలను పరిశీలించడంలో సహాయపడుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos