HPV Vaccination: గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన కోసం అమ్మాయిలకు టీకాలు.!
గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనే లక్ష్యంగా టీకా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు ఆ టీకాలు ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు. పార్లమెంట్‌లో గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రసూతి, శిశు సంరక్షణ కోసం అనేక స్కీమ్‌లను ఒకే సమగ్రమైన ప్రోగ్రామ్ కిందకు తీసుకురానున్నట్లు మంత్రి చెప్పారు.
గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనే లక్ష్యంగా టీకా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు ఆ టీకాలు ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు. పార్లమెంట్‌లో గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రసూతి, శిశు సంరక్షణ కోసం అనేక స్కీమ్‌లను ఒకే సమగ్రమైన ప్రోగ్రామ్ కిందకు తీసుకురానున్నట్లు మంత్రి చెప్పారు. ఇమ్యూనైజేషన్ కోసం కొత్తగా డిజైన్ చేసిన యూ-విన్ ప్లాట్‌ఫామ్‌ను కూడా వాడుకలోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. అంగన్‌వాడీలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనకు సంబంధించిన విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తన ట్విట్టర్‌లో ట్యాగ్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
వైరల్ వీడియోలు
Latest Videos