కోతుల బీభత్సం.. స్కూలుకు వెళ్తున్న విద్యార్ధినిపై వీడియో

Updated on: Jul 03, 2025 | 11:05 AM

ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలో ఇటీవల కాలంలో వన్యప్రాణులు తరచుగా జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. అడవుల్లో ఆహారం, నీటి కొరతతో జంతువులు గ్రామాల్లోకి రావటం, దారిన పోయే వారి మీద దాడి చేసి గాయపరచటంతో ఆ ప్రాంతాల వాసులు భయంతో వణికి పోతున్నారు. తాజాగా , అదిలాబాద్‌ జిల్లాలో కోతులు రెచ్చిపోయాయి. ఉదయం వేళ.. బడికి వెళ్తున్న ఓ బాలికపై మీద తీవ్రంగా దాడిచేసి, గాయపరిచాయి.

ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలోని రంజాన్‌పురా కాలనీలో ఓ బాలిక బడికి వెళుతూ ఉంది. సరిగ్గా, ఆ సమయంలో కొన్ని కోతులు.. ఆమె వెంట పడ్డాయి. అవన్నీ బాలికపై దాడి చేయటమే గాక.. ఆమె వీపు మీద వేలాడుతున్న స్కూలు బ్యాగ్‌‌ను లాక్కోడానికి ప్రయత్నించాయి. ఈ క్రమంలో బాలిక తీవ్ర భయాందోళనకు గురైంది. ఇంతలో అటుగా వస్తున్న ఓ వ్యక్తి కోతులను తరిమివేశాడు. బాలికకు స్వల్పగాయాలు కావడంతో ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు కాలనీవాసులు. కోతుల దాడి దృశ్యాలు అక్కడి సీసీటీవీ పుటేజీలో రికార్డయ్యాయి. ఘటనతో భయాందోళనకు గురైన కాలనీ వాసులు కోతుల బెడదనుంచి తమకు ఉపశమనం కలిగించాలని అటవీశాఖ అధికారులను వేడుకుంటున్నారు. కోతులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ముస్లిం సమాధి వద్ద ఆగే జగన్నాథుడి రథం..ఎందుకో తెలుసా?వీడియో

ఓవర్ థింకింగ్‌కు భగవద్గీత 5 పరిష్కారాలు వీడియో

ఆడుకుందామని గ్రౌండ్‌కి వెళ్లారు..అక్కడి కనిపించింది చూసి షాక్ వీడియో

శివాలయంలో అద్భుతం.. శివలింగంపై నాగుపాము వీడియో