Monkey – iPhone: చూస్తుండగానే ఐఫోన్ ఎత్తుకెళ్లిన కోతి.. ఏం చేసిందంటే.? వీడియో వైరల్..
అల్లరికి కేరాఫ్ కోతులు.. ఆలయాల వద్ద ఈ కోతుల సందడి ఎక్కువగా ఉంటుంది. భక్తులు దేవునికోసం తీసుకెళ్లే టెంకాయలు, అరటిపళ్లు కోసం కాపుకాసుకొని కూచుంటాయి. భక్తుల చేతిలో ఏది కనబడినా క్షణాల్లో లాక్కెళ్లిపోతాయి. ఈ మధ్య ఆహారం మాత్రమే కాదు.. ఇతర వస్తువులు కూడా ఎత్తుకెళ్లిపోతూ భక్తులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. తాజాగా యూపీలోని వృందావన్ గుడిలో ఓ కోతి హంగామా సృష్టించింది. ఓ వ్యక్తి చేతుల్లోంచి ఖరీదైన ఐఫోన్ ఎత్తుకెళ్లిపోయింది.
అల్లరికి కేరాఫ్ కోతులు.. ఆలయాల వద్ద ఈ కోతుల సందడి ఎక్కువగా ఉంటుంది. భక్తులు దేవునికోసం తీసుకెళ్లే టెంకాయలు, అరటిపళ్లు కోసం కాపుకాసుకొని కూచుంటాయి. భక్తుల చేతిలో ఏది కనబడినా క్షణాల్లో లాక్కెళ్లిపోతాయి. ఈ మధ్య ఆహారం మాత్రమే కాదు.. ఇతర వస్తువులు కూడా ఎత్తుకెళ్లిపోతూ భక్తులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. తాజాగా యూపీలోని వృందావన్ గుడిలో ఓ కోతి హంగామా సృష్టించింది. ఓ వ్యక్తి చేతుల్లోంచి ఖరీదైన ఐఫోన్ ఎత్తుకెళ్లిపోయింది. ఫోన్ చేత్తో పట్టుకొని ఆలయానికి వెళ్తున్న అతని చేతిలోని ఐ ఫోన్ లాక్కుని వెళ్లి ఎత్తయిన గోడపైన కూర్చుంది. శ్రీ రంగనాథ్ జీ మందిర్ గోడపై కూర్చున్న ఆ కోతి తన చేతుల్లోని ఫోన్ తీసుకునేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు. ఫ్రూటీ తీసుకొని ఐ ఫోన్ ఇచ్చేయమంటూ కోతి వైపు ఫ్రూటీలు విసిరారు. చివరకు ఓ ఫ్రూటీ ప్యాక్ అందుకున్న ఆ కోతి.. తన చేతుల్లో ఉన్న ఫోన్‌ను వదిలేసింది. కింద ఉన్న వ్యక్తి కోతి వదిలిన ఐఫోన్‌ను చాకచక్యంగా అందుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి ఊపిరిపీల్చుకున్నాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos