Monkey – Old Woman: అన్నం పెట్టి ఆదరించిన బామ్మపై కోతి కృతజ్ఞత.. ఏం చేసిందంటే.. వీడియో.
అన్నం పెట్టి ఆదరించిన ఓ వృద్ధురాలిపట్ల ఓ మూగజీవి తన విశ్వాసాన్ని చాటుకుంది. అనారోగ్యానికి గురైన ఆ బామ్మను ఆ వానరం ప్రతిరోజూ వచ్చి చూసి వెళ్తోంది. బామ్మను ఆప్యాయంగా హత్తుకుంటుంది.
అన్నం పెట్టి ఆదరించిన ఓ వృద్ధురాలిపట్ల ఓ మూగజీవి తన విశ్వాసాన్ని చాటుకుంది. అనారోగ్యానికి గురైన ఆ బామ్మను ఆ వానరం ప్రతిరోజూ వచ్చి చూసి వెళ్తోంది. బామ్మను ఆప్యాయంగా హత్తుకుంటుంది. నీకేం కాదు.. త్వరగా కోలుకుంటావు అన్నట్టుగా భరోసానిస్తుంది.. ఆ రామదూతే నన్ను పంపించాడు అన్నట్లుగా ఆ బామ్మను ఆశీర్వదిస్తుంది. మంచం మీద పడుకొని ఉన్న బామ్మ ఒడిలో కాసేపు కూర్చుంటుంది. అనంతరం అక్కడినుంచి తరలివెళ్తోంది. ఈ అద్భుత దృశ్యం చూస్తుంటే శ్రీరామచంద్రుడు శబరి వద్దకు హనుమంతుడిని పంపించాడా అన్నట్లు ఉంది. ఈ వీడియోను ఓ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటికే 4 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 19 వేలమందికి పైగా లైక్ చేశారు. ఆ వృద్ధురాలిపట్ల ఆ వానరం చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయిపోతున్నారు. మానవత్వాన్ని గుర్తుచేస్తున్న వానరం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..