Prostitution: సినిమా అవకాశాల పేరుతో అమ్మాయిలకు వల.. హైదరాబాద్ అడ్డాగా సెక్స్‌ రాకెట్‌లో 500 మంది అమ్మాయిలు..

Prostitution: సినిమా అవకాశాల పేరుతో అమ్మాయిలకు వల.. హైదరాబాద్ అడ్డాగా సెక్స్‌ రాకెట్‌లో 500 మంది అమ్మాయిలు..

Anil kumar poka

|

Updated on: Feb 12, 2023 | 10:02 AM

సినిమా అందమైన రంగుల ప్రపంచం.. సినిమాల్లో నటించాలనే క్రేజ్‌తో ఎందరో యువతులు సినీ ఇండస్ట్రీవైపు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో సినిమా అవకాశాల పేరుతో ఎందరో మోసపోతున్నారు. తాజాగా ఒక తెలుగు టాప్ డైరెక్టర్

సినిమా అందమైన రంగుల ప్రపంచం.. సినిమాల్లో నటించాలనే క్రేజ్‌తో ఎందరో యువతులు సినీ ఇండస్ట్రీవైపు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో సినిమా అవకాశాల పేరుతో ఎందరో మోసపోతున్నారు. తాజాగా ఒక తెలుగు టాప్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఓ యువకుడు అవకాశాల పేరుతో భారీ సంఖ్యలో యువతులను మోసం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ విషయం హైదరాబాద్ లో ఆన్లైన్ వ్యభిచారం ముఠా గుట్ట రట్టు కావడంతో వెలుగులోకి వచ్చింది. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ సహా మరొక వ్యక్తి అఖిల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. టాలీవుడ్‌లో ఓ టాప్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న సురేష్ బోయిన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సినీ పరిశ్రమలో తనకు అనేక పరిచయాలున్నాయని.. అవకాశం ఇప్పిస్తామని అమ్మాయిలను ట్రాప్ చేశాడు. అనంతరం ఆ యువతులను వ్యభిచారంలోకి దింపి ప్రముఖుల వద్దకు ఆ యువతులను పంపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం అతనిపై కన్నేసిన పోలీసులు అమ్మాయిల ఫోటోలను ఆన్లైన్లో పెట్టి వ్యభిచారం చేస్తున్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్‌ కేంద్రంగా 500 మంది అమ్మాయిలను బెంగళూరు, గోవా వంటి నగరాలకు పంపినట్లు గుర్తించారు. నగరంలోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు మరొకరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:

Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 12, 2023 09:59 AM