Watch: ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! అదిరిపోయిన వీడియో

|

Dec 05, 2024 | 4:19 PM

హనుమకొండలో విచిత్ర సంఘటన జరిగింది.. హాయిగా చెంగుచెంగున ఎగురుతున్న ఓ వానరం విద్యుత్ షాక్ కు గురై రోడ్డుపైన విగతజీవిగా పడిపోయింది. ఈ క్రమంలో అంతా వానరం చనిపోయిందనుకున్నారు. అక్కడున్న మిగిలిన వానరాలు కూడా ఆ వానరం చనిపోయిందనుకొని అక్కడి నుండి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నాలు చేశాయి. అది గమనించిన ఓ వ్యక్తి ఆ వానరాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణం కాపాడాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..? ఆ కోతులు ఎలా కృతజ్ఞత తెలిపాయి తెలుసా..?

ఈ విచిత్ర సంఘటన హనుమకొండలోని కాంగ్రెస్ భవన్ సమీపంలో జరిగింది. విద్యుత్ శాక్ కు గురైన కోతిని గమనించిన జాటోత్ వెంకన్న అనే స్థానిక ఫోటోగ్రాఫర్ దాన్ని కాపాడేందుకు సాహసమే చేశాడు. ఆ కోతుల గుంపు పైకి కర్రతో వెళ్లి వాటిని చెదరగొట్టి కొన ఊపిరితో ఉన్న కోతిని తన వెంట వెటర్నరీ హాస్పిటల్ తీసుకెళ్లాడు. ఆసుపత్రిలో ఆ వానరానికి ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు పోశారు. అక్కడి నుండి మళ్ళీ ఆ కోతిని తీసుకొచ్చి అదే ప్రాంతంలో వదిలాడు. అయితే ఆ వానరం ప్రాణాలు కాపాడిన ప్రోటోగ్రాఫర్ వెంకన్నకు కృతజ్ఞత చెప్పడం కోసం ఆ మూగజీవులు వెంకన్న ఇంటికి పదుల సంఖ్యలో చేరుకున్నాయి. అతని ఇంటి వద్ద ఆ వానర సేనలు కృతజ్ఞత చాటేందుకు చేసిన ప్రయత్నాలు అక్కడున్న వారందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.