Crocodile: గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..

Crocodile: గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..

Anil kumar poka

|

Updated on: Dec 05, 2024 | 4:12 PM

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో మొసలి కలకలం రేపింది. గోదావరి పాయలో మొసలి ఒడ్డుకు వచ్చి హల్‌చల్‌ చేసింది ఓ భారీ మొసలి. అటుగా వెళ్తున్న పశువుల కాపరి దానిని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. అయితే దూరాన్నుంచి దానిని ఫోటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దాంతో అదికాస్తా అటవీశాఖాధికారుల దృష్టికి వెళ్లడంతో రంగంలోకి దిగారు.

తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం మండలంలోని ములకల్లంక శివారున గోదావరి పాయలో మొసలి కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ములకల్లంక గ్రామానికి అర కిలోమీటరు దూరంలో ఉత్తరం వైపున గోదావరి నీరు కొలనుగా ఏర్పడింది. అందులో మొసలి ఒడ్డుకు వచ్చి ఉండటం పశువుల కాపరి చూసి ఫొటో తీశాడు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో అటవీ శాఖాధికారులు మొసలి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం పంపిస్తామని తెలిపారు. వారి సూచనల మేరకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.