Tiger Video: మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..

Tiger Video: మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..

Anil kumar poka

|

Updated on: Dec 05, 2024 | 4:31 PM

తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు బాబోయ్‌ పులి అంటున్నాయి. మూడు జిల్లాల ప్రజలను పులులు టెన్షన్‌ పెడుతున్నాయి. తెలంగాణలోని ఆసిఫాబాద్‌ జిల్లా, ఏపీలోని ప్రకాశం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతోంది. తొలుత ఆసిఫాబాద్‌ జిల్లాలో పులి దాడి చేసింది. నజ్రూల్‌నగర్‌లో ఓ యువతిపై పులిదాడితో కాగజ్‌నగర్ కారిడార్‌లో హై అలర్ట్ ప్రకటించారు. లక్ష్మి అనే యువతి నిన్న పులి దాడిలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ ఉదయం నుంచి కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆపరేషన్ టైగర్ కొనసాగుతోంది.

తాజాగా మరోసారి పెద్దపులి దాడి చేసింది. పొలంలో పనిచేస్తున్న రైతుపై దాడి చేసింది. రైతు సురేష్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించారు. 15 గ్రామాల్లో టైగర్ కోసం వెతుకుతున్నారు. 15 బృందాలు, 90 మంది సిబ్బందితో తనిఖీలు చేస్తున్నారు. 30కి పైగా ట్రాప్ కెమెరాలు, ఒక డ్రోన్ కెమెరాతో టైగర్‌ను ట్రాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పులి సంచారంతో 15 గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. పులి సంచారంపై రైతులను అలర్ట్ చేసినట్లు DFO నీరజ్ తెలిపారు. నవంబర్ మాసం పులికి మేటింగ్ టైమ్ అని.. ఈ టైమ్ లో పులి అగ్రెసివ్ గా ఉంటుందని అన్నారు. పాదముద్రల ఆధారంగా మగ పులిగా గుర్తించామన్నారు.

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురం సమీపంలోని గండి చెరువు పరిసరాలలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది.. నల్లమల అడవి నుండి బయటకు వచ్చిన పులి రైతుల కంట పడింది. దీంతో రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా సిబ్బంది వచ్చి పాద ముద్రలను గుర్తించారు.. రెండు రోజుల క్రితం పులి ఓ ఆవును చంపి తిన్నదని రైతులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి కలకలం రేగింది. కోటబొమ్మాళి మండలం పొడుగుపాడులో పులి సంచరించింది. పులి పాదముద్రలను గుర్తించారు ఫారెస్ట్ సిబ్బంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.