Monkey Viral Video: నడి సముద్రంలో వానరం.. మూడు నెలలుగా అక్కడే.. కానీ ఎందుకో తెలిస్తే కళ్ళు చిమ్మగిల్లటం ఖాయం..

|

Apr 09, 2022 | 9:25 AM

హనుమంతుడు మావాడే కదా.. నేను ఎందుకు దాటలేను అనుకుందో ఏమో... ఓ కోతి నడి సముద్రంలో చిక్కుకుపోయింది. ఎలా వెళ్లిందో తెలీదు కానీ.. మూడు నెలల నుంచి బిక్కు బిక్కుమంటూ అక్కడే కాలం వెళ్లదీసింది. తిరిగి రావటానికి దారి లేక అక్కడే కాంక్రీట్ వేవ్ బ్రేకర్ల మీద తలదాచుకుంటోంది. చేపల వేటకు


హనుమంతుడు మావాడే కదా.. నేను ఎందుకు దాటలేను అనుకుందో ఏమో… ఓ కోతి నడి సముద్రంలో చిక్కుకుపోయింది. ఎలా వెళ్లిందో తెలీదు కానీ.. మూడు నెలల నుంచి బిక్కు బిక్కుమంటూ అక్కడే కాలం వెళ్లదీసింది. తిరిగి రావటానికి దారి లేక అక్కడే కాంక్రీట్ వేవ్ బ్రేకర్ల మీద తలదాచుకుంటోంది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఆహారం అందిస్తుండటంతో ఇన్నాళ్లు ప్రాణాలు దక్కించుకుంది. వానరం దుస్థితికి చలించిన మత్స్యకారులు యానిమల్‌ వారియర్స్​ సంస్థకు సమాచారం అందించడంతో మూడు రోజులు కష్టపడి వానరాన్ని సముద్రపు ఒడ్డుకు చేర్చారు. ప్రకాశం జిల్లా కొత్తపట్టణంలోని స్వచ్ఛంద సంస్థ యానిమల్‌ వారియర్స్‌ కన్జర్వేషన్ సొసైటీలో పనిచేసే సంజీవ్‌ వర్మ, అమర్‌నాథ్, మనీశ్, రామకృష్ణలతోపాటు హైదరాబాద్‌లో వానరాలపై ప్రత్యేకంగా పనిచేసే సంతోషి, అనిరుథ్, కాకినాడ యానిమల్‌ రెస్క్యూ బృందం పడవల్లో వానరం వద్దకు చేరుకొని దాన్ని కాపాడేందుకు ప్రయత్నించారు. మొదటి రెండు రోజులు వానరం వారికి దొరక్కుండా ముప్పు తిప్పలు పెట్టింది. చివరికి మూడోరోజు అంటే మార్చి 26న అతికష్టం మీద వానరాన్ని బోనులో బంధించి ఒడ్డుకు చేర్చారు. అక్కడ నుంచి కాకినాడ జిల్లా అటవీశాఖాధికారి కార్యాలయానికి తరలించి అనంతరం అటవీప్రాంతలో విడిచిపెట్టారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నాడు..

Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..

IPS Officer: అర్థరాత్రి సైకిల్‌పై లేడీ సింగం గస్తీ.! షాక్‌లో సీఎం స్టాలిన్‌..! వైరల్ అవుతున్న వీడియో..