Watch: విందు భోజనానికి వచ్చిన కోతి.. ఆశ్చర్యపోయిన అతిథులు.

Watch: విందు భోజనానికి వచ్చిన కోతి.. ఆశ్చర్యపోయిన అతిథులు.

|

Updated on: Oct 15, 2024 | 1:38 PM

అల్లరి చేష్టలకు కేరాఫ్‌ అడ్రస్‌ కోతి. మనుషులు కూడా తక్కువేం కాదనుకోండి..అందుకే ఎవరైనా చిలిపి చేష్టలు చేస్తే కోతి వేషాలు వెయ్యకు అని అంటుంటారు. కానీ ఈ వానరం మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. చాలా పద్ధతిగల కోతి ఇది. అందుకే అందరూ దానిని మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ కోతి ఏం చేసిందంటే.. ఓ వ్యక్తి భోజనం చేస్తుండగా నేరుగా వెళ్లి అతని ప్లేట్‌లో భోజనం తీసుకుని తినేసింది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ కార్యక్రమంలో కొందరు వ్యక్తులు నేలపై కూర్చుని బంతి భోజనాలు చేస్తున్నారు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ.. సడన్‌గా ఓ కోతి అక్కడికి వచ్చింది. వచ్చీ రావడంతోనే బంతి భోజనాల్లోకి వెళ్లిపోయింది. కోతిని చూడగానే అందరూ కంగారు పడ్డారు. ప్లేట్లలోని తినుబండారాలను ఎత్తుకెళ్తుందేమో అని దాన్ని తరిమే ప్రయత్నం చేశారు. కానీ ఆ కోతి మాత్రం ఏమాత్రం భయపడకుండా.. తానేదో తన మిత్రుడి కోసం వచ్చాను అన్నట్టుగా నేరుగా ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లింది. బంతిలో కూర్చుని భోజనం చేస్తున్న ఆయనకు ఎదురుగా కూర్చుంది. చక్కగా అతని ప్లేటులోని భోజనం తీసుకుని తింటూ కూర్చుంది. ఆ వ్యక్తి కూడా దాన్ని వారించలేదు. ఎంతో పద్ధతిగా భోజనం తీసుకుని తింటున్న వానరాన్ని చూసి ఆ వ్యక్తి ముచ్చట పడ్డాడు. వడ్డించే వ్యక్తి కోతిని తరిమే ప్రయత్నం చేసినా వద్దని చెప్పి, కోతితో కలిసి ఆయన భోజనం చేశారు. ఇలా ఆ కోతి చాలా సేపు అక్కడే కూర్చుని భోజనం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఆ పెద్దాయన మంచి మనసుకు ధన్యవాదాలు.. అంటూ కొందరు, ‘‘ఈ కోతిని చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోంది’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను 15 లక్షల మందికి పైగా లైక్‌ చేశారు. 17. 4 మిలియన్ల మంది వీక్షించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us