బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ.. ఆశ్చర్యంలో జనం

బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ.. ఆశ్చర్యంలో జనం

Phani CH

|

Updated on: Aug 28, 2023 | 8:44 PM

మీ బ్యాంకు ఖాతాను ఓసారిచెక్‌ చేసుకోండి. మీ ఎకౌంట్‌లో మీకు తెలియకుండానే డబ్బులు జమ అయి ఉండొచ్చు. అవును, ములుగు జిల్లాలో అదే జరిగింది. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓ వీధికి చెందిన సుమారు 50 మంది బ్యాంకు ఖాతాల్లో ఆగస్టు 26న వేలల్లో డబ్బులు జమయ్యాయి. ఎవరు పంపారో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియక వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక్కొక్కరికి 2 వేల నుంచి 5 వేలు, 10 వేలు, కొందరికి లక్ష వరకు జమయ్యాయి.

మీ బ్యాంకు ఖాతాను ఓసారిచెక్‌ చేసుకోండి. మీ ఎకౌంట్‌లో మీకు తెలియకుండానే డబ్బులు జమ అయి ఉండొచ్చు. అవును, ములుగు జిల్లాలో అదే జరిగింది. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓ వీధికి చెందిన సుమారు 50 మంది బ్యాంకు ఖాతాల్లో ఆగస్టు 26న వేలల్లో డబ్బులు జమయ్యాయి. ఎవరు పంపారో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియక వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక్కొక్కరికి 2 వేల నుంచి 5 వేలు, 10 వేలు, కొందరికి లక్ష వరకు జమయ్యాయి. ఖాతాలో డబ్బులు పడినట్లు ఫోన్‌లో మెసేజ్‌ రాగానే కొందరు ఫోన్‌పే, గూగుల్‌పే లాంటివాటిద్వారా డబ్బును ఇతర ఖాతాలకు వెంటనే బదిలీ చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఏటూరునాగారంలోని ఎస్బీఐ, పీఎన్‌బీ, ఏపీజీవీబీ, కెనరాబ్యాంక్‌ ఇలా అనేక బ్యాంకుల ఖాతాదారులున్నట్టు తెలుస్తోంది. బ్యాంకర్లు పొరపాటున డబ్బులు వేశారేమో అనుకున్నా… ఆగస్టు 26 శనివారం బ్యాంకులన్నీ బంద్‌. దాంతో, ఈ విషయం తెలుసుకుని ఇంటెలిజెన్స్‌ వర్గాలు, స్థానిక పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి ఆరా తీశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salaar Trailer: ట్రైలర్ పై బిగ్ అనౌన్స్‌మెంట్.. ఇక మొదలవనున్న విధ్వంసం

Gandeevadhari: వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున.. హిట్టా ?? ఫట్టా ??

Ram Gopal Varma: ఇదేందిది !! అసలు ఈ ట్వీట్‌ మనోడిదేనా..

Jai Bhim: దారుణం !! ఒక్కటంటే ఒక్క అవార్డ్ రాలేదా ??

Jr NTR: ‘కంగ్రాట్స్‌ బావా’ నువ్వు కొట్టావంతే !!