కన్నతల్లిని చూసి పారిపోతున్నబుడ్డోడు.. ఏం జరిగిందంటే ??
మగువలకు మేకప్ అంటే ఎంతో ఇష్టం. అయితే కొందరు మరింత అందంగా కనిపించాలని ఎక్కువగా మేకప్ చేసేకుంటారు. అలా చేయడం చర్మానికి మంచిది కాకపోగా కొన్ని సందర్భాలలో నవ్వుల పాలవుతుంటారు. అలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో అనేకం కనిపిస్తుంటాయి.
మగువలకు మేకప్ అంటే ఎంతో ఇష్టం. అయితే కొందరు మరింత అందంగా కనిపించాలని ఎక్కువగా మేకప్ చేసేకుంటారు. అలా చేయడం చర్మానికి మంచిది కాకపోగా కొన్ని సందర్భాలలో నవ్వుల పాలవుతుంటారు. అలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో అనేకం కనిపిస్తుంటాయి. తాజాగా ఓ మహిళ చేసిన మేకప్‌ని చూసి నెటిజన్లు నవ్వుతున్నారు, కానీ ఆమె కొడుకు మాత్రం భయపడిపోయి గుక్కపట్టి ఏడుస్తున్నాడు. సాధారణంగా పుట్టిన పిల్లలే తల్లి స్పర్శతో అమ్మ ఎవరో గుర్తు పట్టేస్తారని చెబుతుంటారు. అలాంటిది ఈ చిన్నోడు తన తల్లిని గుర్తుపట్టలేదంటేనే అర్థం చేసుకోవాలి, ఆమె ఎంతలా మేకప్ వేసుకుందో. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ మహిళ ఫుల్లుగా మేకప్ చేసుకుని కొడుకు దగ్గరకు వస్తుంది. ఆ చిన్నారి తల్లిని గుర్తుపట్టకపోగా.. తనేదో భూతం అన్నట్లుగా ఏడవడం మొదలు పెట్టాడు. ‘నేను మీ అమ్మను’ అన్నట్లు ఆమె ఆ చిన్నోడిని సముదాయించే ప్రయత్నం చేసినా ‘నువ్వు మా అమ్మ కాదు’ అంటూ నెట్టేశాడు. దాంతో ఆమె తన కొడుకును ఒడిలోకి తీసుకుంది. అప్పటికీ ఆ చిన్నోడు తన తల్లిని గుర్తు పట్టినట్లుగా లేడు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు పిచ్చపిచ్చగా నవ్వేసుకుంటున్నారు. మేకప్ వేసుకోవాలి కానీ ఎక్కువైతే ఇలాంటివే జరుగుతాయని, తండ్రికి తగ్గ తనయుడు తల్లిని చూడగానే భయపడ్డాడు అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోను ఇప్పటికే రెండు కోట్ల 42 లక్షలమందికి పైగా వీక్షించగా, వరకు 12 లక్షలమందికి పైగా లైక్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మృతదేహాన్ని కారులో డోర్ డెలివరీ చేసి పరారైన దుండగులు
టాయిలెట్ కెళ్తున్నాడని ఉద్యోగిపై సీరియస్..
నాగుపాముతో ప్రీ వెడ్డింగ్ షూట్.. పిచ్చి ముదిరిందనడానికి నిదర్శనం అంటున్న నెటిజనం
రెంట్ విషయంలో గొడవ.. కోపంమొచ్చిన ఓనర్ ఏ చేసాడంటే ??
దిష్టిబొమ్మ దహనం.. రూ.5 లక్షల జరిమానాతో పాటు నిషేధం