Mogli Student: టవల్‌ కట్టుకుని కాలేజ్‌కి వెళుతున్న మోగ్లీ స్టూడెంట్‌ కన్నయ్య.. చిన్నప్పటినుంచీ బట్టలంటే కన్నయ్యకు చిరాకు..

Updated on: Oct 27, 2022 | 8:44 AM

జంగిల్ బుక్ సినిమా చూసిన వారికి మోగ్లీ గుర్తు ఉండే ఉంటాడు. ఇప్పుడలాంటి మోగ్లీనే మధ్యప్రదేశ్‌లో దర్శనమిచ్చాడు. అయితే, ఈ మోగ్లీ ఉండేది అడవిలో కాదు.. జనారణ్యంలో.. అంతేకాదు, ఈ మోగ్లీ కాలేజీలో చదువుతున్నాడు కూడా.


అతడి పేరు కన్నయ్య. మధ్యప్రదేశ్‌లోని బడ్‌వానీకి చెందిన ఈ యువకుడికి చిన్నప్పటి నుంచీ దుస్తులంటే తెగ చిరాకు. ప్యాంటు, చొక్కా వేసుకోమని సూచించేవారితో మాట్లాడడమైనా మానేశాడు. కానీ దుస్తుల జోలికి వెళ్లలేదు. దుస్తులంటే చిరాకు అతడితోపాటే పెరిగి పెద్దదైంది. తల్లిదండ్రులు నచ్చజెప్పినా వినిపించుకోని కన్నయ్య ఇప్పుడు కాలేజీకి ప్యాంటు, షర్టుకు బదులుగా తువ్వాలు కట్టుకుని వెళ్తున్నాడు. మరి కాలేజీ యాజమాన్యం ఏమీ అనలేదా? అంటే కలెక్టర్ ఆర్డర్ ఉంది మరి!ప్రాథమిక విద్యాభ్యాసం ఉన్నతపాఠశాలతో చేర్పించేందుకు కన్నయ్యను తీసుకెళితే యాజమాన్యం లోనికి అనుమతించ లేదు. చివరకు కలెక్టర్‌ అనుమతి తీసుకున్న తర్వాతే ఎంట్రీ దొరికింది. కళాశాలలో కచ్చితంగా దుస్తులు ధరించాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందిన కన్నయ్య.. పదో తరగతి తర్వాత చదువు ఆపేస్తానని చెప్పాడు. చాలా శ్రమపడి కళాశాలలో చేర్పించారు. ప్రస్తుతం కన్నయ్య ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇప్పటికీ ఓ అండర్‌వేర్‌, పైనుంచి టవల్‌ తప్ప ఒంటిపై ఇంకేమీ ధరించడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 27, 2022 08:44 AM