MLA Talari VenkatrRao: ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి..! కూర్చుని ఉంటే ఒళ్లు పెరుగుతుందని.. వ్యవసాయం చేస్తూ…వీడియో
MLA Talari VenkatrRao: ఒక ఊరికి సర్పంచ్‌గా గెలిస్తేనే బైక్ వదిలి కార్లో తిరిగే రోజులు ఇవి. అలాంటిది ఇక శాసనసభ్యడిగా గెలిస్తే వారి డాబు ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కాని, ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఎమ్మెల్యే వేరు..ఇతను పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు. కాన్షీరాం స్ఫూర్తితో దళిత,
MLA Talari VenkatrRao Doing farming: ఒక ఊరికి సర్పంచ్‌గా గెలిస్తేనే బైక్ వదిలి కార్లో తిరిగే రోజులు ఇవి. అలాంటిది ఇక శాసనసభ్యడిగా గెలిస్తే వారి డాబు ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కాని, ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఎమ్మెల్యే వేరు..ఇతను పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు. కాన్షీరాం స్ఫూర్తితో దళిత, బహుజనుల సమస్యల పరిష్కారం కోసం యువకుడిగా తిరిగిన ఆయన తర్వాత కాలంలో కాంగ్రెస్‌లో చేరారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిగా పార్టీ జెండా మోసిన తలారి.. తర్వాత వైఎస్ జగన్‌తో కలిసి వైసీపీ కోసం పని చేశారు. 2019 ఎన్నికల్లో నియోజకవర్గంలో 40వేల మెజార్టీతో టిడిపి కంచు కోటలాంటి గోపాలపురం నియోజకవర్గం నుంచి గెలిచారు.అయితే, గెలిచిన తర్వాత అసెంబ్లీ జరిగే రోజులు మినహా మిగతా అన్ని రోజులు…ఉదయం 5 గంటలకే తన స్కూటీపై మూడు కిలో మీటర్ల దూరంలోని యాదవోలు రోడ్డులో ఉన్న తన పొలానికి వెళతారు. అక్కడ ఉన్న ఆవులు, గేదెలకు పాలు స్వయంగా తీసి డైరీకి పోస్తారు. గేదెలకు దాణా వేయటం, వాటి ఆలనా పాలన చూసుకుని కాపలాదారుడికి తగిన సలహాలు ఇచ్చి తిరిగి పౌల్ట్రీ లో కోళ్లకు మేత వేస్తారు. ఈ పనులు పూర్తయిన తర్వాత వివిధ రకాల సమస్యలతో వచ్చే ప్రజలకు అందుబాటులో ఉంటారు.శాసనసభ్యుడిగా గెలిచాక ఎందుకిలా చేస్తున్నారంటే.. ‘‘కూర్చుంటే ఒళ్లు పెరుగుతుంది. తనకు వ్యవసాయం, పశుపోషణపై చిన్నతనం నుంచి ఆసక్తి ఎక్కువ.’’ అని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చెబుతున్నారు. ప్రజలను కలిసేందుకు వెళ్లినా తాను వారితో కలసి నడవటం, నిలబడే వారితో మాట్లాడుతుంటానని ఆయన చెప్పుకొస్తున్నారు. నిజంగా ఖద్దరు చొక్కా నలగకుండా, పాలేరులతో పనులు చేయించుకునే వారికి ఇలా గోపాలపురం ఎమ్మెల్యే తలారి ఆదర్శంగా నిలుస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Ranveer Singh: అమ్మాయిల కలల రాకుమారుడు.. నెట్టింట వైరల్ అవుతోన్న మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఫోటోలు.