AI Girlfriends: అమ్మాయిలు వద్దు.. ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ ముద్దు అంటున్న మగవారు.. ఎందుకంటే.?

AI Girlfriends: అమ్మాయిలు వద్దు.. ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ ముద్దు అంటున్న మగవారు.. ఎందుకంటే.?

Anil kumar poka

|

Updated on: Oct 15, 2023 | 6:56 PM

లేటెస్ట్ టెక్నాల‌జీ రాక‌తో వ‌ర్చువ‌ల్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ గ‌ర్ల్‌ఫ్రెండ్స్ అనూహ్యంగా పెరుగుతున్నారు. అమెరికాలో ఈ ట్రెండ్ పెరుగుతుండ‌టం పట్ల నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఒర‌వ‌డి యువ‌త‌లో ఒంట‌రితనాన్ని మ‌రింత పెంచుతుంద‌ని అంటున్నారు. ఏఐ గ‌ర్ల్‌ఫ్రెండ్స్ అందుబాటులోకి రావ‌డంతో పురుషుల్లో ఒంట‌రిత‌నాన్ని మ‌రింత ప్రోత్సహిస్తుందని ఒలిన్ బిజినెస్ స్కూల్ ప్రాక్టీస్ ఆఫ్ డేటా సైన్స్ ప్రొఫెస‌ర్ లిబ‌ర్టీ విటెర్ట్ హెచ్చ‌రించారు.

లేటెస్ట్ టెక్నాల‌జీ రాక‌తో వ‌ర్చువ‌ల్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ గ‌ర్ల్‌ఫ్రెండ్స్ అనూహ్యంగా పెరుగుతున్నారు. అమెరికాలో ఈ ట్రెండ్ పెరుగుతుండ‌టం పట్ల నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఒర‌వ‌డి యువ‌త‌లో ఒంట‌రితనాన్ని మ‌రింత పెంచుతుంద‌ని అంటున్నారు. ఏఐ గ‌ర్ల్‌ఫ్రెండ్స్ అందుబాటులోకి రావ‌డంతో పురుషుల్లో ఒంట‌రిత‌నాన్ని మ‌రింత ప్రోత్సహిస్తుందని ఒలిన్ బిజినెస్ స్కూల్ ప్రాక్టీస్ ఆఫ్ డేటా సైన్స్ ప్రొఫెస‌ర్ లిబ‌ర్టీ విటెర్ట్ హెచ్చ‌రించారు. ప్రొఫెసర్‌ విటెర్ట్‌ త‌న క్లాస్‌లోని 18 ఏండ్ల స్టూడెంట్స్‌ను మీరు ఏ సోష‌ల్ మీడియా యాప్ వాడుతున్నార‌ని అని అడ‌గ్గా ఓ విద్యార్ధి త‌న‌కు ఏఐ గ‌ర్ల్‌ఫ్రెండ్ ఉంద‌ని చెప్ప‌డంతో షాక్‌కు గురైంది. వ‌ర్చువ‌ల్ గ‌ర్ల్‌ఫ్రెండ్స్.. అబ్బాయిలతో ముచ్చ‌టిస్తూ, ప్రేమిస్తూ, పర్ఫెక్ట్ రిలేష‌న్‌షిప్‌ను క్రియేట్ చేసే ప‌లు యాప్స్ అందుబాటులోకి రావడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రెప్లికా అనే ప్ర‌ముఖ యాప్ కు కోటి మంది యూజ‌ర్లు ఉండ‌గా వీరిలో 35 శాతం క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని కుదిపేసిన స‌మ‌యంలో పెరిగారు. యూజ‌ర్లు ఏఐ పార్ట్‌న‌ర్స్‌తో ప్రేమ‌లో మున‌గ‌డం, రిలేష‌న్‌షిప్స్‌లో ఉండ‌టంతో పాటు వారిని వివాహం కూడా చేసుకుంటున్నారట. ఏఐ గ‌ర్ల్‌ఫ్రెండ్స్ అవ‌స‌రాల‌న్నీ తీరుస్తాయ‌ని, రియ‌ల్ రిలేష‌న్‌షిప్‌లో ఉండే ఎగుడు దిగుళ్లు ఉండ‌క‌పోవ‌డంతో పురుషులకు ఇవి ప‌ర్ఫెక్ట్ రిలేష‌న్‌షిప్స్‌గా మారుతున్నాయ‌ని ప్రొఫెస‌ర్ విటెర్ట్ తెలిపారు. ఈ ధోర‌ణి పురుషుల ఒంట‌రిత‌నాన్ని మరింత దిగ‌జారుస్తున్నాయ‌ని దీన్ని మ‌హ‌మ్మారిగా అభివ‌ర్ణిస్తూ ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ ప‌రిణామం పురుషుల్లో సింగిల్స్‌ను పెంచేస్తుంద‌ని, అమెరికాలో బ‌ర్త్ రేట్స్‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..