Viral: బాలిక మెదడులో సగ భాగం స్విచ్చాఫ్ చేసిన వైద్యులు..!  ఎందుకంటే..?

Viral: బాలిక మెదడులో సగ భాగం స్విచ్చాఫ్ చేసిన వైద్యులు..! ఎందుకంటే..?

Anil kumar poka

|

Updated on: Oct 15, 2023 | 6:44 PM

వైద్యశాస్త్రంలో సంచలనం నమోదైంది. ఆరేళ్ల బాలిక ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు ఆమె మెదడులోని సగభాగాన్ని నిద్రాణ స్థితిలోకి తీసుకెళ్లారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలిక మెదడులోని రెండు భాగాల మధ్య సంబంధాన్ని తెంచి ఓ భాగాన్ని స్విచ్ఛాఫ్ చేశారు. అమెరికా కాలిఫోర్నియాలోని లోమా లిండా యూనివర్సిటీ హెల్త్ ఆసుపత్రిలో ఇటీవల ఈ ప్రత్యేక ఆపరేషన్ జరిగింది.

వైద్యశాస్త్రంలో సంచలనం నమోదైంది. ఆరేళ్ల బాలిక ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు ఆమె మెదడులోని సగభాగాన్ని నిద్రాణ స్థితిలోకి తీసుకెళ్లారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలిక మెదడులోని రెండు భాగాల మధ్య సంబంధాన్ని తెంచి ఓ భాగాన్ని స్విచ్ఛాఫ్ చేశారు. అమెరికా కాలిఫోర్నియాలోని లోమా లిండా యూనివర్సిటీ హెల్త్ ఆసుపత్రిలో ఇటీవల ఈ ప్రత్యేక ఆపరేషన్ జరిగింది. చిన్నారి బ్రియానా బోడ్లీ రాస్‌ముసెన్స్ ఎన్‌సెఫెలైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి వచ్చిన బాధితుల్లో మెదడు వాచిపోతుంది. పరిస్థితి ముదిరితే బాలిక అవయవాల్లో కదలికలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని వైద్యులు గుర్తించారు. ఈ సమస్యకు పరిష్కారంగా డాక్టర్ ఆరన్ రాబిన్సన్ సారథ్యంలోని వైద్య బృందం శస్త్రచికిత్స చేసి తొలుత బాలిక మెదడులోని సగ భాగాన్ని తొలగిద్దామనుకున్నారు. అయితే, భష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చిన్నారి మెదడులోని సగ భాగాన్ని పూర్తిస్థాయిలో నిద్రాణస్థితికి తీసుకెళ్ళారు. మెదడులో రెండు భాగాల మధ్య ఉన్న కనెక్షన్‌ను తెంచేశామని వైద్యులు తెలిపారు. ఆ తరువాత రోగం నయమైందన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..