పంటపొలాల్లో చిరుత.. వణికిపోతున్న రైతులు
మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. తుఫ్రాన్ మండలం అటవీ ప్రాంతంలో కొన్ని రోజులుగా సంచరిస్తోన్న చిరుత.. అక్కడి జనాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. చిరుత సంచారంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయంగా ఉందని స్థానికులు,రైతులు వాపోయారు. చిరుత భయంతో పొలాలకు వెళ్లలేకపోతున్నామని వారు వాపోయారు.
వెంటనే అటవీ శాఖ అధికారులు ఆ చిరుతను బంధించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. బుధవారం పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులకు దూరంగా ఓ చిరుత కనిపించింది. దీంతో వారు అప్రమత్తమై.. భయంతో పరుగులు తీశారు. తర్వాత అదే చిరుత.. తూప్రాన్ మండలం దాతర్ పల్లి, మల్కాపూర్ వెళ్లే రహదారిలోని అడవి ప్రాంతంలో ఉదయం పూట.. ఒక పెద్ద బండరాయిపై పై కనిపించింది. దీంతో ఆ దారిన పోతున్న కొందరు.. ఆ చిరుతను సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. అయితే.. గత నెల రోజులుగా చిరుత అక్కడక్కడే తిరుగుతోందని, దీంతో తాము భయభయంగా తిరగాల్సి వస్తోందని వారు వాపోయారు. రాత్రి వేళ పొలాలకు వెళ్లటం మానుకున్నామని వారు చెప్పుకొచ్చారు. ఇకనైనా.. అధికారులు స్పందించి బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని కోరుతున్నారు. మరో వైపు రైతులను రాత్రి పూట ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలికపైనుంచి దూసుకెళ్లిన కారు.. ఆ తర్వాత..
రూ.240 కోట్ల లాటరీ గెలిచాడు.. ట్యాక్స్ లేకుండా మొత్తం అకౌంట్‌లోకి.. వర్కౌట్ అయిన అమ్మ సెంటిమెంట్
రెస్టారెంట్ బిల్లు ఎగ్గొట్టి .. ఖతర్నాక్ ప్లాన్ బెడిసికొట్టి..
