వర్క్‌ ఫ్రం హోమ్‌ ఎఫెక్ట్‌.. థియేటర్‌లోనూ ల్యాప్‌టాప్‌లో వర్క్‌

వర్క్‌ ఫ్రం హోమ్‌ ఎఫెక్ట్‌.. థియేటర్‌లోనూ ల్యాప్‌టాప్‌లో వర్క్‌

Phani CH

|

Updated on: May 02, 2023 | 10:13 PM

కోవిడ్‌ సమయంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాయి. దాంతో ప్రజెంట్‌ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ నడుస్తోంది. ఇంటి నుండి పని చేయడం వల్ల ప్రయోజనాలే కాదు, ప్రతికూలతలు కూడా ఉంటాయి. చాలా మంది తమ ఇతర పనులను కూడా ఆఫీస్‌ వర్క్‌ టైమ్‌లోనే పూర్తి చేసుకుంటున్నారు.

కోవిడ్‌ సమయంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాయి. దాంతో ప్రజెంట్‌ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ నడుస్తోంది. ఇంటి నుండి పని చేయడం వల్ల ప్రయోజనాలే కాదు, ప్రతికూలతలు కూడా ఉంటాయి. చాలా మంది తమ ఇతర పనులను కూడా ఆఫీస్‌ వర్క్‌ టైమ్‌లోనే పూర్తి చేసుకుంటున్నారు. కొంతమంది సెలవుల్లో కూడా ఎక్కడికి వెళ్లినా ల్యాప్‌టాప్‌ మెడలో వేసుకొని వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ ఓ వ్యక్తి సినిమా థియేటర్‌లో సినిమా చూస్తూ కూడా తన ల్యాప్‌టాప్‌లో ఆఫీసు పని చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియో బెంగళూరుకు చెందినదిగా తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి సినిమా థియేటర్‌లో సినిమా చూస్తూ ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ కనిపించాడు. వీడియో చూస్తుంటే సినిమా ఇంకా స్టార్ట్‌ కాలేదనిపిస్తోంది. ఇంతలో టైం వేస్ట్‌ ఎందుకని ఆ వ్యక్తి తన ల్యాప్‌ట్యాప్‌ ఓపెన్‌ చేసి పనిచేసుకుంటున్నాడు. సినిమా చూడటానికి అదే థియేటర్‌లో ఉన్న మిగతా ప్రేక్షకులు ఈ వ్యక్తి తన ల్యాప్‌టాప్‌తో థియేటర్ లోపల కూర్చున్న క్షణాన్ని రికార్డ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పక్షికి ఎంఆర్‌ఐ స్కాన్‌.. ఎందుకోతెలుసా ??

మెక్సికో తీరంలో అరుదైన బ్లూ హోల్‌.. నెట్టింట వైరల్

స్నానం చేయలేక వాషింగ్‌ మెషిన్‌లోకి వెళ్లావా ఏంటి ??

నెల్లూరులో వింత దొంగలు..ఏం చేశారో చూస్తే షాక్ అవ్వాల్సిందే

కర్మఫలం అంటే ఇదేనేమో.. చోరీకి వెళ్లిన అతను.. చివరికి ??