దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి కుక్కను కాపాడిన వ్యక్తి !! వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి కుక్కను కాపాడిన వ్యక్తి !! వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

Phani CH

|

Updated on: Aug 19, 2022 | 9:05 AM

ఓ రైల్వే స్టేషన్‌లోకి వేగంగా రైలు దూసుకొస్తోంది. అదే రైలు పట్టాలపై ఓ శునకం తిరుగుతూ ఉంది. అది గమనించిన ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి ఆ కుక్కను కాపాడాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఓ రైల్వే స్టేషన్‌లోకి వేగంగా రైలు దూసుకొస్తోంది. అదే రైలు పట్టాలపై ఓ శునకం తిరుగుతూ ఉంది. అది గమనించిన ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి ఆ కుక్కను కాపాడాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిని ప్రశంసలతో అభినందిస్తున్నారు. లోక‌ల్ ట్రైన్ స్టేష‌న్‌లోకి వ‌స్తుండ‌గా పెద్దసంఖ్యలో ప్రయాణీకులు వేచిఉన్నారు. ఈ స‌మ‌యంలో రైలు ప‌ట్టాల‌పై వీధి కుక్క తిర‌గ‌డం గ‌మ‌నించిన ఓ వ్యక్తి ట్రాక్స్‌పైకి దూకి కుక్కను ప‌ట్టుకుని ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికుల‌కు అందించాడు. అనంతరం ఆ వ్యక్తిని ప్రయాణీకులు ప్లాట్‌ఫాం పైకి లాగ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియోను ముంబై మేరి జాన్ అనే యూజ‌ర్‌ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఇది ముంబై…ఈ వ్య‌క్తికి గౌర‌వం ఇవ్వండ‌ని పోస్ట్‌కు క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. ఈ వీడియోను దాదాపు రెండు లక్షలమంది వీక్షించారు. అనేకమంది లైక్‌ చేస్తూ పలురకాల కామెంట్లు చేస్తున్నారు

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మామగారిని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టిన కోడలు !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Published on: Aug 19, 2022 09:05 AM