మామగారిని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టిన కోడలు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఓ మహిళ తన మామగారిని చెప్పులతో నిర్దాక్షిణ్యంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒక మహిళ తన తండ్రి, సోదరుడితో కలిసి వృద్ధుడిని కొట్టిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో వెలుగుచూసింది.
ఓ మహిళ తన మామగారిని చెప్పులతో నిర్దాక్షిణ్యంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒక మహిళ తన తండ్రి, సోదరుడితో కలిసి వృద్ధుడిని కొట్టిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో వెలుగుచూసింది. చెప్పులు, పంచ్‌లతో కొట్టడమే కాకుండా నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ముగ్గురు కలిసి కనికరం లేకుండా కొట్టడంతో వృద్ధుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఈ మొత్తం సంఘటన హైవే మధ్య కూడలి వద్ద పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే జరిగింది. ఇదంతా వీడియోతీసిన కొందరు స్థానికులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దాంతో వీడియో కాస్త వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో…కోడలు మామగారిని ఆస్తి విభజించమని కోరడంతో అతను నిరాకరించాడు. దాంతో ఆగ్రహించిన ఆమె తన సోదరుడు, తండ్రిని పిలిపించి వృద్ధుడైన మామగారిపై దాడికి దిగింది. నడిరోడ్డుపై అతన్ని ఈడ్చి ఈడ్చి కొట్టారు. ఈ వీడియో కాస్తా ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి చేరింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళ, ఆమె తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. కాగా బాధితుడు మీడియాతో మాట్లాడుతూ.. అంతకుముందే తన తమ్ముడు మరణించాడని తెలిపారు. అయితే తన తమ్ముడి కోడలు, ఆమె సోదరుడు తమ ఆస్తిని విభజించి ఆమె పేరు మీద బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారని, అందుకు తాను ఒప్పుకోలేదని వృద్ధుడు చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
News Watch: శవ యాత్రలో భగవద్గీత వినిపిస్తే ఏమౌతుందో తెలుసా ?
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

