మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు

|

Dec 23, 2024 | 6:54 PM

దొంగల్లో వీడో వింత దొంగ. ఎవరైనా దొంగతానానికి వెళ్తే డబ్బో, నగలో, లేదా విలువైన వస్తువులేవైనా ఎత్తుకెళ్తారు. కానీ వీడు మాత్రం ఆడవాళ్ల జాకెట్లు మాత్రం చోరీ చేస్తాడు. అదేవిట్రా అంటే.. అది నా బలహీనత అంటున్నాడు. ఇలాంటి వాడిని పోలీసులు మాత్రం ఏం చేస్తారు పాపం... అది తప్పురా.. ఇంకెప్పుడూ అలా చేయకు.. మరోసారి ఇలా చేస్తే ఈ సారి కౌన్సిలింగ్‌ వేరేలా ఉంటుంది అని వార్నింగ్‌ ఇచ్చి వదిలేసారు.

ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. నర్సాపురం మండలం దర్బరేవులో గత కొంతకాలంగా మహిళల రవికలు కనిపించకకుండా పోతున్నాయి. స్నానం చేసే సమయంలో బాత్రూం గోడలు, తలుపులపై వదిలిన రవికె, జాకెట్లు మాత్రమే చోరికి గురవుతున్నాయి. తొలుత బాధితులు ఏదైనా కోతి ఎత్తుకెళ్లిందో, లేదా ఏ గాలికో ఎటో ఎగిరిపోయిందా అని సరి పెట్టుకున్నారు. కాని ఇది ఒక్కరి ఇంట్లో కాదు చాలా మంది ఇళ్లలో ఇలాగే రవికెలు మాయం అవుతుండటంతో కలకలం రేగింది. ఇప్పటి వరకు సుమారు 300 జాకెట్లు మాయం అయ్యాయి. రాత్రి సమయంలో నిఘా పెట్టినా ఫలితం లేకపోయింది. విషయాన్ని కనిపెట్టలేకపోయారు. తాజాగా ఓ వ్యక్తి చేతిలో జాకెట్ కనిపించటం, అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని ఆపి ప్రశ్నించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అప్పు చేస్తే ఉప్పురాయి కూడా మిగలదు. మైక్రో ఫైనాన్స్ వలలో ఇరుక్కున్నారేమో చూసుకోండి

రాజమండ్రిలో కేవలం రూ.5 కే బిర్యానీ..

నగ్నంగా రైలెక్కిన యువకుడు.. మహిళల కంపార్టుమెంట్‌లోకి వెళ్లి..

ఎక్కడికక్కడ గడ్డకట్టిన.. సరస్సులు, జలపాతాలు

ఈ విగ్గు రాజా.. విగ్గులు మారుస్తూ 50 మంది యువతులుకు మోసం