Family Bike: ఇది బైక్ కాదు.. ఫ్యామిలీ బస్.! ఒకే బైక్ పై దంపతులు, ఐదుగురు పిల్లలు వారి వెంట లగేజీ.. ఇంకా..

Updated on: Nov 28, 2022 | 9:28 AM

ఒక బైక్‌పైన సౌకర్యంగా ఇద్దరు .. కొంచెం సర్దుకుంటే ముగ్గురు ప్రయాణించొచ్చు. కానీ ఈ వీడియో చూస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే ఈ వీడియోలో ఓ వ్యక్తి తన బైక్‌ పైన ఏకంగా..


వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఆ వ్యక్తి తన బైక్‌పైన అతని భార్య, ఐదుగురు పిల్లలతో పాటు రెండు పెంపుడు కుక్కలను కూడా ఎక్కించుకున్నాడు. ఎంతో చాకచక్యగా లగేజీని కూడా తగిలించుకుని ఏకంగా 40 కి.మీ వేగంతో దూసుకుపోతున్నాడు. అది చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. వీరిలో ఒక్కరంటే ఒక్కరూ హెల్మెట్ ధరించలేదు. ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. పోలీసులకు పట్టుబడితే, చలాన్లు కట్టేందుకు ఈ వ్యక్తి లోన్‌ తీసుకోక తప్పదంటూ ఓ నెటిజన్ హాస్యంగా కామెంట్ చేశాడు. మరో యూజర్ అయితే.. ‘చలాన్లు ఏమీ ఉండవు. వీరిని ఆపిన వారు, అసలు ఇంత మంది ఎలా సర్దుకున్నారంటూ గమనించాల్సి వస్తుంది’ అని కామెంట్ పెట్టాడు. ఈ వీడియోను ఇప్పటికే లక్షలమంది వీక్షించగా వేలల్లో లైక్‌ చేస్తున్నారు. తమదైనశైలిలో కామెంట్లు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.

Man with street dogs: వీధి కుక్కలే నేస్తాలుగా పుట్‌పాత్‌పై నిద్రపోతున్న వ్యక్తి..! 24 క్యారెట్స్‌ గోల్డ్‌ అంటున్న నెటిజనం..

Massage for Minister: తీహార్‌ జైలు కొత్త ట్విస్ట్‌.. మంత్రి సత్యేంద్రకు మసాజ్‌ చేసింది అతడే వ్యక్తి..! వీడియో

 

Published on: Nov 28, 2022 09:28 AM