Bike Drive: ప్లీజ్‌.. నాలా ఎవరూ చేయకండి..! ఎక్స్ ప్రెస్ వేపై 310 కి.మీ. వేగంతో బైక్‌ నడిపిన రైడర్.. (వీడియో)

Updated on: Nov 13, 2022 | 9:29 AM

అతి వేగం ఎంత ప్రమాదకరమో తెలిసి కూడా కొందరు తమ వాహనాలపై వేగంగా దూసుకుపోతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. వారి ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తారు. ఒక్కోసారి ప్రాణాలే కోల్పోతారు.


ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై 300 కిమీ వేగంతో వెళ్తున్న నలుగురు వ్యక్తులు బీఎమ్‌డబ్ల్యూ కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే హర్యానాలోని వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై గంటకు 310 కి.మీ వేగంతో ఒక వ్యక్తి తన బైక్‌ను నడుపుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది.ఇందులో బైకర్ దిల్‌ప్రీత్, మరికొందరు బైకర్లతో కలిసి రైడ్ కోసం బయలుదేరాడు. అతను 310 కి.మీ వేగాన్ని చాలాసార్లు తాకినట్లు వీడియోలో తెలుస్తుంది. బైకర్లు నింజా 2000, బీఎండబ్ల్యూ, డ్యుకాటీ, అపాచీ 310 వంటి హై ఎండ్ బైకులపైన వాయు వేగంతో దూసుకెళ్లారు. 300 కి.మీ వేగం అందుకున్న రైడర్ దిల్‌ప్రీత్ తనలా ఎవ్వరూ ఇలాంటి సాహనం చేయొద్దని హెచ్చరించాడు. ఈ వీడియో ఓ ప్రముఖ సోషల్‌మీడియా ఛానెల్‌లో అప్‌లోడ్ అయిన ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Nov 13, 2022 09:27 AM