నిందితులపై బుల్డోజర్‌ యాక్షన్‌ చేపట్టిన ముంబై సర్కార్‌

|

Jan 26, 2024 | 12:29 PM

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టారు. అన్ని ప్రాంతాల్లో భక్తి పాటలు, కోలాటాలతో వేడుకగా శ్రీరాముడి ఊరేగింపును నిర్వహించారు. ముంబై శివార్లలో మీరా రోడ్డులో కార్లు, బైక్‌లపై కాషాయ జెండాతో ఆదివారం రాముడి శోభా యాత్ర నిర్వహించారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. తాజాగా ఆ ప్రాంతంలో మహారాష్ట్ర సర్కార్‌ బుల్డోజర్‌ చర్యకు దిగింది.

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టారు. అన్ని ప్రాంతాల్లో భక్తి పాటలు, కోలాటాలతో వేడుకగా శ్రీరాముడి ఊరేగింపును నిర్వహించారు. ముంబై శివార్లలో మీరా రోడ్డులో కార్లు, బైక్‌లపై కాషాయ జెండాతో ఆదివారం రాముడి శోభా యాత్ర నిర్వహించారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. తాజాగా ఆ ప్రాంతంలో మహారాష్ట్ర సర్కార్‌ బుల్డోజర్‌ చర్యకు దిగింది. అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో రాముని ఊరేగింపుపై రాళ్లు రువ్విన వారి నివాసాలను బుల్డోజర్‌లతో కూల్చివేసింది. మీరా రోడ్డులో అక్రమంగా నిర్మించిన కట్టడాలను బుల్డోజర్‌తో కూలగొట్టింది. దాదాపు 15 అక్రమ బిల్డింగ్‌లను నేలమట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. కూల్చివేత సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొదట రేసులో ఉన్న విగ్రహం ఇదే.. తెల్లని మక్రానా పాలరాయితో రామ్‌లల్లా

అయోధ్యకు వెళ్లే బస్సులు బంద్‌ !! ఎప్పటిదాకా అంటే ??

KGF: సూపర్ డూపర్ క్రేజీ న్యూస్.. మరో సారి కేజీఎఫ్

Mrunal Thakur: ‘ఇంత చేసినా.. అవకాశాలు రావడం లేదు’ హీరోయిన్ ఎమోషనల్

పేద, ధనిక విభజనేంటి.. అధికారుల తీరుపై తాప్సి సీరియస్