Viral Video: ఒరయ్యా.. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి.? జిహ్వకో రుచి అన్నారని మరీ ఇలానా..

Viral Video: పెద్దలు జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అంటుంటారు. అయితే సోషల్‌ మీడియా (Social media) పుణ్యామాని ఈ రెండింటిని చూడాల్సి వస్తోంది. సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది ఔత్సాహికులు కొత్త కొత్త వంటకాలను...

Viral Video: ఒరయ్యా.. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి.? జిహ్వకో రుచి అన్నారని మరీ ఇలానా..
Follow us

|

Updated on: May 18, 2022 | 11:51 AM

Viral Video: పెద్దలు జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అంటుంటారు. అయితే సోషల్‌ మీడియా (Social media) పుణ్యామాని ఈ రెండింటిని చూడాల్సి వస్తోంది. సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది ఔత్సాహికులు కొత్త కొత్త వంటకాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో వెరైటీ డిష్‌లను నెటిజన్లు చూసి నేర్చుకుంటున్నారు, ట్రై చేసి వంటలను రుచి చేస్తున్నారు కూడా. అయితే ఏమంటూ ఈ లైక్‌లు, షేర్‌ల హడావుడి మొదలైందో ఏదో రకంగా ట్రెండింగ్‌లో నిలవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

వంటకాలను మాములుగా చేస్తే ఎవరు చూస్తారు అనుకుంటున్నారో ఏమో కానీ, కాస్త పైత్యాన్ని జోడించి చేస్తున్నారు. అసలు ఊహకు కూడా అందని కాంబినేషన్స్‌తో వంటలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న మ్యాంగోతో మ్యాగీ తయారు చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌ అవుతోంది. మొన్న మ్యాంగో మ్యాగీ అయితే నేడు పేస్ట్రీ మ్యాగీ వైరల్‌ అవుతోంది. పేస్ట్రీ (కూల్‌ కేక్‌)తో మ్యాగీని తయారు చేశాడు ఓ నెటిజన్‌. దీనిని వీడియోగా తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇందుకోసం ముందుగా ఓ ప్యాన్‌ను స్టౌవ్‌పై ఉంచి.. ఆయిల్‌ వేసి అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేశారు. అనంతరం ఓ పేస్ట్రీని ప్యాన్‌లో వేసి అందులో నీరు పోశారు. పేస్ట్రీ మొత్తం నీళ్లలా మారిన తర్వాత అందులో మ్యాగీతో పాటు, మసాలా వేశారు. చివరిగా పేస్ట్రీ మ్యాగీని సర్వ్‌ చేశారు. ఈ పేస్ట్రీ మ్యాగీ రుచి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే విచిత్రంగా ఉంది కదూ! వీడియో చూసిన నెటిజన్లు కూడా ఇలాగే స్పందిస్తున్నారు. నెట్టింట తెగ చక్కర్లు కొడుతోన్న ఈ వీడియోపై మీరూ చూసేయండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?