ఊరందరి ముందు భార్య కాళ్లు మొక్కిన భర్త.. ఎందుకంటే ??
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో హృదయాలను కదిలించే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. గద్వాల పట్టణం సుంకులమ్మ మెట్టుకు చెందిన డ్రైవర్ గోవింద్‌కు రాజేశ్వరి అనే యువతితో వివాహమైంది. అయితే గోవిందు మద్యం మత్తులో తరుచూ తన భార్యతో గొడవపడి చేయి చేసుకునేవాడు. విసిగిపోయిన రాజేశ్వరి చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల తరువాత రాజీ కొరకు జాతీయ లోక్ అదాలత్‌కు చేరింది.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో హృదయాలను కదిలించే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. గద్వాల పట్టణం సుంకులమ్మ మెట్టుకు చెందిన డ్రైవర్ గోవింద్‌కు రాజేశ్వరి అనే యువతితో వివాహమైంది. అయితే గోవిందు మద్యం మత్తులో తరుచూ తన భార్యతో గొడవపడి చేయి చేసుకునేవాడు. విసిగిపోయిన రాజేశ్వరి చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల తరువాత రాజీ కొరకు జాతీయ లోక్ అదాలత్‌కు చేరింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె కుషా సమక్షంలో జరిగిన లోక్ అదాలత్ ఈ దంపతులను కలిపి దండలను మార్చుకొనేలా చేసింది. ఈ సందర్భంగా గోవింద్ భావోద్వేగానికి గురయ్యాడు. తాగిన మైకంలో తన భార్యను కొడుతుండడం పొరపాటేనని నిజాయితీగా ఒప్పుకున్నాడు. దీంతో న్యాయమూర్తులు ఆమెకు సారీ చెప్పాలని కోరగా… సారే కాదు.. కాళ్లే మొక్కుతానని తన భార్య కాళ్ళకు మొక్కాడు. అంతేకాదు తన తల్లిదండ్రులకు మించి తన భార్య తనను చూసుకుంటుందని ఇక ముందు అలా చేయనని గోవింద్ చెప్పాడు. ఈ సంఘటనతో లోక్ అదాలత్ ఒక్క సారిగా చప్పట్లతో మార్మోగిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Expensive Coin : ప్రపంచంలోనే ఖరీదైన కాయిన్.. చూస్తే కళ్లు చెదరాల్సిందే !!
ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయో !! మహిళ ఐడియాకు నెటిజన్లు ఫిదా
అబ్బ.. ఈ కోతి ఎంత మంచిదో !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

