ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయో !! మహిళ ఐడియాకు నెటిజన్లు ఫిదా
సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు. ఒకసారి ఉపయోగించిన వస్తువును మరోసారి మరో రూపంలో ఉపయోగించుకోవచ్చు. తాజాగా ఇక్కడ ఓ మహిళ ఖాళీ టూత్‌పేస్ట్ సాచెట్‌ను ఉపయోగించిన విధానం చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఏం ఐడియా మేడమ్ అనిపిస్తుంది. దానికి సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా పోస్ట్ చేశారు. దాంతో కాస్తా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వాటర్ ట్యాంక్ కుళాయి పాడై నీరు లీకవుతోంది.
సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు. ఒకసారి ఉపయోగించిన వస్తువును మరోసారి మరో రూపంలో ఉపయోగించుకోవచ్చు. తాజాగా ఇక్కడ ఓ మహిళ ఖాళీ టూత్‌పేస్ట్ సాచెట్‌ను ఉపయోగించిన విధానం చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఏం ఐడియా మేడమ్ అనిపిస్తుంది. దానికి సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా పోస్ట్ చేశారు. దాంతో కాస్తా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వాటర్ ట్యాంక్ కుళాయి పాడై నీరు లీకవుతోంది. అది చూసిన మహిళకు ఓ వినూత్న ఆలోచన వచ్చింది. వెంటనే ఖాళీ పేస్ట్ సాచెట్ తీసుకుని దాని వెనుక వైపు కట్ చేసి కుళాయి పైపునకు కట్టింది. దానికి మూత పెట్టేస్తే నీరు ఆగిపోతోంది. నీరు కావాలనుకున్నప్పుడు ఆ మూత తీసేస్తే చాలు ఎంచక్కా నీరు బయటకు వస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హర్ష్ గోయెంకా పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగానే వీక్షించారు. వెయ్యి మందికి పైగా లైక్ చేశారు. ఆ మహిళ తెలివితేటలపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఐడియా నెక్ట్స్ లెవెల్, భారతీయ మహిళలు టూత్ పేస్ట్ ట్యూబ్ చాలా విధాలుగా వాడతారు అంటూ కామెంట్లు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అబ్బ.. ఈ కోతి ఎంత మంచిదో !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

