Expensive Coin : ప్రపంచంలోనే ఖరీదైన కాయిన్.. చూస్తే కళ్లు చెదరాల్సిందే !!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాయిన్‌ను బ్రిటన్‌లో ఆవిష్కరించారు. దివంగత క్వీన్ ఎలిజబెత్-2 గౌరవార్థం ఈ నాణేన్ని రూపొందించారు. ఇది అన్ని కాలాలలో అత్యంత విలువైనదని భావిస్తున్నారు. దాదాపు 4 కిలోల బంగారం, 6,400 కంటే ఎక్కువ వజ్రాలతో తయారు చేసిన ఈ నాణెం విలువ సుమారు 23 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల 192 కోట్ల రూపాయలని స్థానిక మీడియా పేర్కొంది. లగ్జరీ లైఫ్ స్టైల్ బ్రాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసిన ఈ నాణేన్ని క్వీన్ ఎలిజబెత్-2
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాయిన్‌ను బ్రిటన్‌లో ఆవిష్కరించారు. దివంగత క్వీన్ ఎలిజబెత్-2 గౌరవార్థం ఈ నాణేన్ని రూపొందించారు. ఇది అన్ని కాలాలలో అత్యంత విలువైనదని భావిస్తున్నారు. దాదాపు 4 కిలోల బంగారం, 6,400 కంటే ఎక్కువ వజ్రాలతో తయారు చేసిన ఈ నాణెం విలువ సుమారు 23 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల 192 కోట్ల రూపాయలని స్థానిక మీడియా పేర్కొంది. లగ్జరీ లైఫ్ స్టైల్ బ్రాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసిన ఈ నాణేన్ని క్వీన్ ఎలిజబెత్-2 మొదటి వర్ధంతి సందర్భంగా విడుదల చేశారు. కామన్వెల్త్ దేశాల్లోని హస్తకళాకారులు 16 నెలలపాటు శ్రమించి దీన్ని తయారు చేశారు. దీన్ని మరింత ఘనంగా రూపొంచాలనుకున్నా వజ్రాల కొరత కారణంగా సాధ్యం కాలేదు. 9.6 అంగుళాల కంటే ఎక్కువ వ్యాసం కలిగిన ఈ నాణెం బాస్కెట్‌బాల్ పరిమాణం కలిగి ఉంది. దీనిపై ప్రఖ్యాత పోర్ట్రెయిట్ కళాకారులు మేరీ గిల్లిక్, ఆర్నాల్డ్ మచిన్, రాఫెల్ మక్లౌఫ్, ఇయాన్ ర్యాంక్-బ్రాడ్లీలు దివంగత చక్రవర్తి చిత్రాలను తీర్చిదిద్దారు. 2 పౌండ్ల బరువు ఉండే నాణేం చుట్టూ ఒక ఔన్స్ బరువు కలిగిన చిన్న చిన్న నాణేలను జత చేశారు. నాణెం అంచుల్లో క్వీన్ సూక్తులను ముద్రించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయో !! మహిళ ఐడియాకు నెటిజన్లు ఫిదా
అబ్బ.. ఈ కోతి ఎంత మంచిదో !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

