Little Boy Fun: బుడి బుడి అడుగుల ఈ బుడ్డోడు చేసిన పనికి శభాష్‌ అనాల్సిందే..! వీడియో వైరల్

సాధారణంగా ఏడాది, రెండేళ్ల వయసు పిల్లలు ఎప్పుడూ ఏదో అల్లరి చేస్తూ తల్లిని విసిగిస్తుంటారు. కానీ ఇక్కడ ఓ బుడ్డోడు చేసిన పనికి నెటిజన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు. నిండా మూడేళ్లు కూడా లేని

Little Boy Fun: బుడి బుడి అడుగుల ఈ బుడ్డోడు చేసిన పనికి శభాష్‌ అనాల్సిందే..! వీడియో వైరల్

|

Updated on: Feb 23, 2023 | 9:29 PM

సాధారణంగా ఏడాది, రెండేళ్ల వయసు పిల్లలు ఎప్పుడూ ఏదో అల్లరి చేస్తూ తల్లిని విసిగిస్తుంటారు. కానీ ఇక్కడ ఓ బుడ్డోడు చేసిన పనికి నెటిజన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు. నిండా మూడేళ్లు కూడా లేని ఓ చిన్నారి తన తల్లికి ఎంత సాయం చేసాడో చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో ఓ మహిళ వ్యాన్‌లోనుంచి 20 లీటర్ల ఖాళీ వాటర్‌ బాటిళ్లను రూమ్‌లో పెట్టేందుకు కిందకు దించుతోంది. ఈ క్రమంలో ఆమె చిన్నారి బాబు బుడి బుడి అడుగులు వేసుకుంటూ తల్లి తీస్తున్న డబ్బాలను తీసుకొచ్చి రూమ్‌లో ఒక ప్లాట్‌పారంమీద పెడుతున్నాడు. నిజానికి ఆ ప్లాట్‌ ఫాం వాడికి అందడంలేదు. అయినా ఆ బుడ్డోడు వెనక్కి తగ్గలేదు.. ఎంతో చాకచక్యంగా ఆ బాటిళ్లను పైనపెడ్డాడు. అదికూడా ఎలాపడితే అలా పెట్టేయలేదు.. చక్కగా క్రమపద్ధతిలో పెట్టాడు. మొదట ఒక డబ్బానే తెచ్చిన బాలుడు రెండోసారి తన చిట్టి చేతులతో రెండు బాటిళ్లను ఒకేసారి తీసుకొచ్చాడు. ఒకబాటిల్‌ బాగానే పైన పెట్టేసాడు.. రెండో బాటిల్‌ పెట్టలేకపోయాడు. ఇంతలో తల్లి వచ్చి అతనికి సాయం చేసింది. ఆ తర్వాత ఆ డబ్బాను సక్రమంగా పెట్టి మళ్లీ మరో డబ్బా తెచ్చేందుకు వ్యాన్‌ వద్దకు పరుగెత్తాడు ఆ చిట్టి హీరో.. ఐపీఎస్‌ ఆఫీసర్‌ దీపాన్షు కబ్రా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. లక్షలమంది ఈ వీడియోను వీక్షించారు. వేలల్లో లైక్‌ చేస్తూ బుడతడి తపనకు మురిసిపోతూ కామెంట్ల బ్లెస్సింగ్‌ కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.

Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?

Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..

Follow us