Elephant Attack: ఎందుకమ్మా అంత తొందర..? ఏనుగుకు కోపం తెప్పిస్తే గిట్లుందీ.. పాపం డ్రైవర్..!
రోడ్డుపై వెళ్తుండగా ఏనుగు కనిపించింది. వాహనాలను దూరంగా పార్క్ చేసి, ఏనుగు బయలుదేరే వరకు వేచి ఉన్నారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం అతితెలివిని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు.
జనం పెరిగి అడవులు అంతరిస్తున్నాయి. దాంతో అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. కొన్నిసార్లు అడవుల్ని దాటి వచ్చిన జంతువులు సమీపంలో నివసించే వ్యక్తులపై దాడి చేస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు షాక్ అవుతారు. కొందరు రోడ్డుపై వెళ్తుండగా ఏనుగు కనిపించింది. వాహనాలను దూరంగా పార్క్ చేసి, ఏనుగు బయలుదేరే వరకు వేచి ఉన్నారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం అతితెలివిని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. అతను రోడ్డుపై ఏనుగు సమీపం గుండా వెళ్లాలనుకున్నాడు. దాంతో ఆ ఏనుగుకు చిర్రెత్తిపోయింది. ఆ వెహికల్‌పై ఒక్కసారిగా దాడి చేసింది. డ్రైవర్ చాకచక్యం ఏనుగు ముందు పనిచేయలేదు. క్షణాల వ్యవధిలో ఏనుగు వాహనాన్ని రెండు సార్లు పల్టీ కొట్టించింది. ఈ ఘటనలో వెహికల్ ధ్వంసం కాగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి రూపిన్ శర్మ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ అద్భుతమైన క్యాప్షన్ రాశారు. ‘‘నా ప్రాంతంలో ఎందుకు ఇల్లు కట్టుకున్నారు’’ అని రాశారు. ఈ ఘటన గౌహతిలోని నారంగిలో చోటుచేసుకుందని ఆయన తెలిపారు. పాత వీడియో అయినప్పటికీ మరోసారి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..