Shocking Incident: పి.హెచ్.సీ లో కామాంధుడు.. మహిళా సిబ్బంది బట్టలు మార్చుకునే గదిలో సీక్రెట్ కెమెరా పెట్టి..
ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడోచోట ఉన్మాదుల బారిన పడకతప్పడం లేదు. అనంతపురం జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఓ ఘటన మహిళా సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోంది.
ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడోచోట ఉన్మాదుల బారిన పడకతప్పడం లేదు. అనంతపురం జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఓ ఘటన మహిళా సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోంది. యాడికి మండలం రాయలచెరువు పీహెచ్‌సీలో మహిళా సిబ్బంది దుస్తులు మార్చుకునేటప్పుడు నరేంద్ర అనే టెండర్ రహస్యంగా వీడియోలు తీస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ బాక్స్ కు రంద్రం చేసి.. అందులో సెల్ ఫోన్ పెట్టి వీడియో తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. మహిళా సిబ్బంది బట్టలు మార్చుకునే గదిలో రహస్యంగా సెల్‌ఫోన్ అమర్చి గత కొంతకాలంగా నరేంద్ర ఈ దారుణానికి పాల్పడుతున్నట్టు స్పందన కార్యక్రమంలో 40 మంది మహిళా సిబ్బంది కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంకా ఎవరెవరి వీడియోలు అందులో ఉన్నాయో తెలియక ఆందోళనకు గురవుతున్నారు మహిళా ఉద్యోగులు.ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు. అతడి వద్ద ఉన్న ఫోన్ సీజ్ చేసి.. తమ పరువుకు భంగం కలగకుండా చూడాలని నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సిబ్బంది కోరారు. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది. ఈ ఆరోపణల్లో నిజం ఎంత..? ఆ వీడియోలు.. అతడి వద్ద మాత్రమే ఉన్నాయా..? ఎవరికైనా షేర్ చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

