Viral Video: చిరుతకే చెమటలు పట్టించిన కోతి.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.. వైరల్ వీడియో..

చిరుతపులి తన చురుకుదనంతో ఎలాంటి జంతువునైనా ఓడించగలదు. అలాంటి చిరుతకే ఓ కోతి చుక్కులు చూపించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: చిరుతకే చెమటలు పట్టించిన కోతి.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.. వైరల్ వీడియో..
Wildlife Viral Video
Follow us

|

Updated on: Apr 28, 2022 | 7:15 AM

అడవి(Wildlife Video)లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ జంతువుపై దేనిపై దాడి చేస్తుందో చెప్పడం చాలా కష్టం. అయితే అప్పుడప్పుడు చిన్న జంతువులు కూడా భారీ ఆకారం ఉన్న జంతువులకు చుక్కలు చూపిస్తుండడం మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అడవిలో చాలా రకాల జంతువులు కనిపిస్తాయి. కానీ, చిరుతపులి(Leopard ) తన చురుకుదనంతో ఎలాంటి జంతువునైనా ఓడించగలదు. స్పీడ్‌ విషయంలో దానికి సమానంగా ఏ జంతువు నిలవలేదు. కానీ, అలాంటి చిరుతకే ఓ కోతి(Monkey) చుక్కులు చూపించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లను ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది. చిరుతనే ముప్పతిప్పలు పెట్టిన కోతిని అంతా మొచ్చుకుంటున్నారు. దీంతో ఈ వీడియోను నెట్టింట్లో తెగ షేర్ చేస్తున్నారు.

ఇక వీడియో విషయానికి వస్తే.. కోతిని వేటాడేందుకు చిరుతు సిద్ధమైంది. అయితే, భూమిపై అయితే, చిరుతే విజయం సాధించి ఉండేదేమో. తెలివిగా కోతి మాత్రం ఏకంగా ఓ చెట్టు ఎక్కింది. చిరుత మాత్రం నేనేం తక్కువ కాదంటూ.. చెట్టుపైకి ఎక్కింది. అసలు కథ ఇక్కడే మొదలైంది. పూర్తిగా ఆధిపత్యం చూపించిన కోతి, చిరుతకు చిక్కకుండా చుక్కలు చూపించింది.

చిరుతపులులు చెట్లను ఎక్కడంలో ఎంతో ప్రావీణ్యం పొందాయని తెలిసిందే. అలాంటి వాటికే ఈ చిన్న కోతి చెట్టుపైనే ముప్పుతిప్పలు చూపించింది. కోతిని పట్టుకోవడానికి చిరుతపులి చెట్టు ఎక్కుతుండగా, తనను తాను రక్షించుకోవడానికి కోతి చెట్టు కొమ్మలకు వేలాడుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. చిరుతపులి కోతి వద్దకు రావడం ప్రారంభించిన వెంటనే, కోతి చెట్టుపై ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మపైకి దూకుతూ, తప్పించుకుంది. ఈ క్రమంలో చిరుతకే చెమటలు పట్టించింది.. ఈ సీన్ చూస్తుంటే మాత్రం.. ఒకదానితో ఒకటి ఆడుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఇది చూడ్డానికి చాలా తమాషాగా అనిపించినా.. కోతి వేగం ముందు చిరుత చురుకుదనం ఫలించలేదు. దీంతో అటు ఇటు తిరిగి తీవ్రంగా అలసిపోయి, అలానే కొమ్మపైనే చేసేదేం లేక కూర్చుండిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Digital TOP 9 NEWS: ఆకట్టుకుంటున్న చాక్లెట్‌ పాము.. | టైల్స్‌ కింద రూ. 10కోట్ల క్యాష్‌.!

Viral News: చికెన్ ముక్కలు తక్కువ వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు.. ఆ తరువాత ట్విస్ట్ అదిరిపోయింది..!

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..