Leopard: అనంతపురం జిల్లాలో చిరుత రోడ్డు దాటుతుంది.! ఇంతలో..

Leopard: అనంతపురం జిల్లాలో చిరుత రోడ్డు దాటుతుంది.! ఇంతలో..

Anil kumar poka

|

Updated on: Jan 29, 2024 | 12:18 PM

ఇటీవల వన్యమృగాలు జనావాసాల్లోకి చొరబడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో చిరుత సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రోడ్డు దాటుతూ కనిపించిన చిరుతను చూసి వాహనదారులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వాహనాలను ఎక్కడివక్కడ నిలిపివేసారు. కళ్యాణదుర్గం మండలం కొత్తూరు సమీపంలోని అటవీ ప్రాంతంలోని రహదారిపై వాహనాలు దూసుకెళ్తున్నాయి.

ఇటీవల వన్యమృగాలు జనావాసాల్లోకి చొరబడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో చిరుత సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రోడ్డు దాటుతూ కనిపించిన చిరుతను చూసి వాహనదారులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వాహనాలను ఎక్కడివక్కడ నిలిపివేసారు. కళ్యాణదుర్గం మండలం కొత్తూరు సమీపంలోని అటవీ ప్రాంతంలోని రహదారిపై వాహనాలు దూసుకెళ్తున్నాయి. ఇంతలో పక్కనే అటవీ ప్రాంతంనుంచి ఏవో శబ్ధాలు వినిపించాయి. దాంతో అనుమానం వచ్చిన వాహనదారులు కొంతదూరంలో వాహనాలు నిలిపి వేశారు. ఇంతలో పొదలలో నుంచి చిరుత గాండ్రిస్తూ బయటకు వచ్చింది. రోడ్డు దాటుతున్న చిరుత దూరంగా నిలిపి ఉన్న ద్విచక్రవాహన లైట్లు వెలుగులో స్పష్టంగా కనిపించింది. చిరుత రోడ్డుదాటి పొలాల్లోకి వెళ్లిపోయింది. దాంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం వాహనదారులు తమదారిన వెళ్లిపోయారు. చిరుత సంచారం గురించి అటివీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos