Bike Theft: కొట్టేసిన బైక్ ఎక్కడికి తీసుకెళ్ళాలో తెలియక భలే దొరికిపోయాడు.!
దొంగతనానికి ప్లాన్ చేసేటప్పుడు ఎంట్రీ, ఎగ్జిట్, ఎస్కేప్, అయ్యేందుకు పక్కా ప్లాన్‌తో ఏ దొంగైనా స్కెచ్ వేస్తాడు. కానీ ఇక్కడ ఒక దొంగ.. దొంగతనం చేయడం ఒక్కటే ప్లాన్ చేసినట్టున్నాడు. ఎలా ఎస్కేప్ అవ్వాలో మర్చిపోయి భలే విచిత్రంగా దొరికిపోయాడు. పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని దొంగిలించాడు ఓ దొంగ. బైక్‌ను అయితే చోరీ చేశాడు ఆ దొంగ.. కానీ ఎక్కడికి వెళ్లాలి? ఎలా వెళ్లాలి? అనే లాజిక్ మిస్ అయినట్టున్నాడు.
దొంగతనానికి ప్లాన్ చేసేటప్పుడు ఎంట్రీ, ఎగ్జిట్, ఎస్కేప్, అయ్యేందుకు పక్కా ప్లాన్‌తో ఏ దొంగైనా స్కెచ్ వేస్తాడు. కానీ ఇక్కడ ఒక దొంగ.. దొంగతనం చేయడం ఒక్కటే ప్లాన్ చేసినట్టున్నాడు. ఎలా ఎస్కేప్ అవ్వాలో మర్చిపోయి భలే విచిత్రంగా దొరికిపోయాడు. పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని దొంగిలించాడు ఓ దొంగ. బైక్‌ను అయితే చోరీ చేశాడు ఆ దొంగ.. కానీ ఎక్కడికి వెళ్లాలి? ఎలా వెళ్లాలి? అనే లాజిక్ మిస్ అయినట్టున్నాడు. దీంతో పారిపోయే క్రమంలో ఓ కిరాణా షాపులోకి బైక్ తో సహా దూరిపోయాడు.
మామిళ్ల కుంట క్రాస్ వద్ద షాపులోకి దూరిన దొంగ.. ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. దొంగతనం చేయడానికి ధైర్యం కోసం మందు తాగాడట. కానీ ఆ బైకును దొంగతనం చేసి ఎలా తీసుకెళ్లాలో? ఎటు పారిపోవాలో తెలియక.. ఓ వైపు జనం వెంట పడుతుంటే ఏకంగా కిరాణా షాపులోకి దూరిపోయాడు. ఇంకేముంది స్థానికులు, షాపు నిర్వాహకుడు దొంగను పట్టుకుని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. దీంతో స్థానికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

