Leopard: పూల మొక్కలకోసం వెళ్తే.. పులి కనిపించింది.! వైరల్ అవుతున్న వీడియో.
తూర్పు గోదావరి జిల్లాలోరాజమండ్రి శివారులో గత కొంత కాలంగా చిరుత సంచారం కలకలాన్ని సృష్టిస్తోంది. ఇటీవల దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో అమర్చిన ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలు కనిపించాయి. దాంతో దివాన్‌చెరువు పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. తాజాగా చిరుత రూటు మార్చింది. ఇప్పుడు చిరుత కడియం వైపు జనావాసాల్లోకి పయనిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
తూర్పు గోదావరి జిల్లాలోరాజమండ్రి శివారులో గత కొంత కాలంగా చిరుత సంచారం కలకలాన్ని సృష్టిస్తోంది. ఇటీవల దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో అమర్చిన ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలు కనిపించాయి. దాంతో దివాన్‌చెరువు పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. తాజాగా చిరుత రూటు మార్చింది. ఇప్పుడు చిరుత కడియం వైపు జనావాసాల్లోకి పయనిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం రాత్రి కడియపు లంక దోసాలమ్మ కాలనీలో చిరుత సంచరిస్తుండగా చూసిన నర్సరీ రైతు మధు అధికారులకు సమాచారం ఇచ్చారు.
డీఎఫ్ఓ భరణి అక్కడకు చేరుకుని పాదముద్రలు సేకరించి చిరుతగా నిర్ధారించారు. దీంతో నర్సరీ కార్మికులకు నర్సరీ సంఘం బుధవారం సెలవు ప్రకటించింది. ఆలమూరు మండలం గోదావరి తీరం వైపునకు చిరుత పయనిస్తున్నట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చిరుత సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చిరుతని ట్రాప్ బోనులతో పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుతను కచ్చితంగా పట్టుకుంటామని ఫారెస్టు అధికారులు భరోసా ఇస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.