Viral: వీడేం డాక్టర్.? అనంతపురం ప్రభుత్వ వైద్యుడి నిర్లక్ష్యం..
అనంతపురం జిల్లాలో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఒక వైద్యం కోసం వెళితే.. ఇంకో ట్రీట్మెంట్ చేసి పంపించాడు ఆ డాక్టర్. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఈ దారుణానికి పాల్పడింది డాక్టర్ రమణ నాయక్. కూడేరు మండలం హంసాయపల్లికి చెందిన రాధమ్మ అనే మహిళ అనారోగ్యంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చింది. రాధమ్మను పరీక్షించిన వైద్యుడు గర్భసంచిలో సమస్య ఉందని..
అనంతపురం జిల్లాలో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఒక వైద్యం కోసం వెళితే.. ఇంకో ట్రీట్మెంట్ చేసి పంపించాడు ఆ డాక్టర్. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఈ దారుణానికి పాల్పడింది డాక్టర్ రమణ నాయక్. కూడేరు మండలం హంసాయపల్లికి చెందిన రాధమ్మ అనే మహిళ అనారోగ్యంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చింది. రాధమ్మను పరీక్షించిన వైద్యుడు గర్భసంచిలో సమస్య ఉందని.. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన పరికరాలు లేవని.. ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పాడు. తన ప్రైవేటు ఆసుపత్రికి వస్తే ఆపరేషన్ చేస్తానని చెప్పాడు. దీంతో ఈనెల 9వ తేదీన రమణ నాయక్ కు చెందిన లావణ్య ఆసుపత్రిలో రాధమ్మకు ఆపరేషన్ చేసి.. అదేరోజు డిశ్చార్జ్ చేశారు.
డిశ్చార్జ్ అయిన తర్వాత రెండు రోజులు మూత్రం రాకపోవడంతో.. బాధితురాలు రాధమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో తిరిగి రమణ నాయక్ ఆసుపత్రికి వచ్చింది. అక్కడ పరీక్షలు చేయగా…తప్పు జరిగిందన్న విషయం వైద్యుడికి అర్థమయ్యింది. అయితే ఆ విషయాన్ని దాచిపెట్టి ఆమెను హుటాహుటిన మరో ఆసుపత్రికి తరలించాడు. అక్కడ అసలు విషయం బయటపడింది. రెండు రోజులుగా మూత్రం రాక.. కిడ్నీ వాచిందని సదరు ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు రాధమ్మకు, ఆమె కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో లావణ్య ఆసుపత్రిలో డాక్టర్ రమణ నాయక్ అసలు గర్భసంచి ఆపరేషన్ చేయలేదని… దానికి బదులు మూత్ర నాళం తొలగించారని బాధితురాలు రాధమ్మ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. దీంతో ఆగ్రహంతో బాధితురాలి బంధువులు లావణ్య హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు.తక్షణం నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుణ్ణి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

