Lava flow: ఈ నదిలో ప్రవహించేది నీరు కాదు.. ఏంటో మీరే చూడండి.. మీ కళ్ళును మీరే నమ్మలేరు…
నదులు గురించి మనందరికీ తెలిసిందే. వాటిలో దిగి ఈతకొట్టడం, సరదాగా ఆడుకోవడం వంటివి ఎన్నో చేశాం. సాధారణంగా నదుల్లో నీరు ప్రవహిస్తుంటుంది. కానీ అదే నదిలో లావా ప్రవహిస్తే..
నదులు గురించి మనందరికీ తెలిసిందే. వాటిలో దిగి ఈతకొట్టడం, సరదాగా ఆడుకోవడం వంటివి ఎన్నో చేశాం. సాధారణంగా నదుల్లో నీరు ప్రవహిస్తుంటుంది. కానీ అదే నదిలో లావా ప్రవహిస్తే.. వింటుంటేనే భయంకరంగా అనిపిస్తోంది కదూ.. మీరు విన్నది నిజమే. ఓ అగ్నిపర్వతం బద్దలై లావా బయటకు వచ్చినప్పుడు ఆ ప్రవాహం అచ్చం నదిని తలపించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నదిలోని నీరు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో, అదే విధంగా ఇక్కడ అగ్నిపర్వతంలోని లావా చాలా వేగంగా ప్రవహిస్తుంది. అది హవాయిలోని బిగ్ ఐలాండ్‌లోని కిలౌయా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు విడుదలైన లావాగా అధికారులు గుర్తించారు. ఇది ప్రపంచంలోని క్రియాశీలక అగ్నిపర్వతాలలో ఒకటి. ఈ అగ్నిపర్వతంలో తరచుగా విస్ఫోటనాలు జరుగుతుంటాయి. దీని కారణంగా భూకంపాలూ సంభవిస్తాయి.ఈ వీడియో వండర్ ఆఫ్ సైన్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను మిలియన్‌మందికి పైగా వీక్షించారు. వేలల్లో లైక్ చేస్తూ వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ‘ఇది నిజమని నాకు తెలుసు, కానీ దానిని చూడగానే ప్రవహించే లావా వీడియో గేమ్‌లా కనిపిస్తోంది’ అని కొందరు, మరొకరు ఇది భయానకంగానూ, అందంగానూ ఉందని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

