Zebra Fish : జీబ్రా ఫిష్‌తో గుండెకు వైద్యం.. అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు.. మరిన్ని వివరాలు…

చేపల్లో రకరకాల చేపలుంటాయి. వాటిలో కొన్ని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తాజాగా మనిషి ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడే ఫిష్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది.

Zebra Fish : జీబ్రా ఫిష్‌తో గుండెకు వైద్యం.. అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు.. మరిన్ని వివరాలు...

|

Updated on: Aug 07, 2022 | 9:43 AM


చేపల్లో రకరకాల చేపలుంటాయి. వాటిలో కొన్ని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తాజాగా మనిషి ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడే ఫిష్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది. అదే జీబ్రా ఫిష్‌. ఇవి చాలా అందంగా ఉండటమే కాదు అద్భుతమైనవి కూడా. ఎందుకంటే తమలోని కొన్ని శరీర భాగాలను అవి మళ్లీ పుట్టించుకోగల ప్రత్యేకత వాటి సొంతం. అవి తమ కంటిలోని రెటీనా కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవు. ఏదైనా దెబ్బతగిలినప్పుడు గాయపడ్డ తమ గుండె కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవని తాజా అధ్యయనంలో తేలింది. మనుషుల గుండె కండరాల్లోని కణాలను కార్డియోమయోసైట్స్‌ అంటారు. గుండె కండరానికి తగినంత ఆక్సిజన్‌ సరఫరా కాని సందర్భాల్లో… గుండెపోటు వస్తుంది. అప్పుడు గుండె తాలూకు కణాలు అంటే కార్డియోమయోసైట్స్‌ దెబ్బతింటాయి. ఫలితంగా దెబ్బతిన్న చోట గుండెపై గాటు లాంటిది ఏర్పడుతుంది. దీన్నే ‘ఫైబ్రోసిస్‌’అంటారు. ఇలా జరిగిన సందర్భాల్లో గుండె బలహీనమవుతుంది. అయితే జీబ్రాఫిష్‌లో గుండె కణాల ప్రవర్తన కాస్త విభిన్నంగా ఉంటుంది. ఏదైనా కారణంతో గుండె కణజాలం లేదా కణాలు దెబ్బతింటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే.. 20 శాతం మళ్లీ పుడతాయి. ఈ కొత్త అధ్యయనం ద్వారా జీబ్రా ఫిష్‌లో మాదిరిగా గుండె కణజాలం మళ్లీ పుట్టేలా చేసేందుకు… కణ ఆధారిత చికిత్సలు, మందులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. దెబ్బతిన్న భాగంలోని కణాలు మళ్లీ పుట్టేలా చేయడానికిగానీ లేదా దెబ్బతిన్న గుండె వద్ద పూర్తిగా రిపేరు చేసేందుకు గానీ వీలవుతుందని తెలుస్తోంది. ‘‘ఈ చిన్నచేప తమ అవయవాలను ఎలా పునరుత్పత్తి చేసుకోగులుతోందో తెలుసుకోవాలనుకుంటున్నామని, జర్మనీలోని బెర్లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సిస్టమ్స్‌ బయాలజీకి చెందిన ఫిలిప్‌ జంకర్‌ తెలిపారు. ఆయన తన పరిశోధనను సెంటర్‌ ఫర్‌ మాలెక్యులార్‌ మెడిసిన్‌కు చెందిన మాక్స్‌ డెల్‌బ్రక్‌తో పాటు కొనసాగించారు. పరిశోధన ఫలితాలు ‘నేచర్‌ జెనెటిక్స్‌’ జర్నల్‌లో ప్రచురించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us