Professor in bikini: బికినీ ధరించిన ప్రొఫెసర్.. ఓ స్టూడెంట్ చేసిన పనికి రూ.99 కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం.!
బికినీ ధరించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పెట్టిన ఓ మహిళా ప్రొఫెసర్ తన ఉద్యోగాన్ని కోల్పోయారు. యూనివర్సిటీకి అపార నష్టాన్ని కలిగించారని నష్టపరిహారంగా 99కోట్లు కట్టాలంటూ ఆమెను వర్సిటీ అధికారులు ఆదేశించారు.
బికినీ ధరించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పెట్టిన ఓ మహిళా ప్రొఫెసర్ తన ఉద్యోగాన్ని కోల్పోయారు. యూనివర్సిటీకి అపార నష్టాన్ని కలిగించారని నష్టపరిహారంగా 99కోట్లు కట్టాలంటూ ఆమెను వర్సిటీ అధికారులు ఆదేశించారు. గతేడాది అక్టోబర్‌లోనే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, తానేం తప్పు చేయలేదని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని ఆ ప్రొఫెసర్ చెబుతున్నారు. కోల్‌కతాలోని ప్రముఖ సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీ కి చెందిన 18ఏళ్ల యువకుడు.. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్రొఫెసర్ బికినీలో ఉన్న ఫొటోలు చూడటం అతడి తండ్రి గమనించాడు. దీనిపై విశ్వవిద్యాలయానికి ఫిర్యాదు చేశాడు. దీనిపై విశ్వవిద్యాలయం తీవ్రంగా స్పందించింది. వర్సిటీకి కోలుకోలేని నష్టాన్ని కలిగించారంటూ ఆమెను ఉద్యోగంలోనుంచి తొలగించింది. దీనిపై ఆ మాజీ ప్రొఫెసర్ తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. గత అక్టోబర్‌లో రిజిస్ట్రార్, ఉప కులపతితో కూడిన ఓ కమిటీ విచారణను తాను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఆ సమావేశంలో ఫిర్యాదు లేఖను తన ముందు చదివి వినిపించి.. ఉద్యోగం నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అదే నెల చివరి వారంలో తాను రాజీనామా చేసినట్లు వివరించారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో డ్రెస్ కోడ్‌కు సంబంధించి తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, ఇన్‌స్ట్రా ప్రొఫైల్ కూడా ప్రైవేట్ ఎకౌంట్ అన్నారు. దాన్ని ఎవరో హ్యాక్ చేశారేమోనని, అందుకే ఆ ఫొటోలు లీకయ్యాయంటూ అదే నెలలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనవసరంగా తనను ఉద్యోగంలోనుంచి తొలగించారని, హైకోర్టును ఆశ్రయిస్తానన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

