పదిహేనేళ్ల కల నెరవేరింది.. కుమారి ఆంటీ భావోద్వేగం!వీడియో

Updated on: Sep 11, 2025 | 1:28 PM

తనదైన మాటలతో.. రుచికరమైన వంటలతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న కుమారి ఆంటీ అంటే తెలియని వారుండరు. సోషల్‌ మీడియాలో సైతం తరచూ ఆమె తన ఫుడ్‌ వీడియోలను పంచుకుంటారు. ఈ క్రమంలో తన పదిహేనేళ్ల కల నెరవేరిందంటూ కుమారి ఆంటీ తాజాగా చెప్పుకొచ్చారు. ఇటీవలి వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా జరిగిన ఓ లడ్డూ వేలంలో ఆమె పాల్గొని, గణేశుడి ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆమె పెట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వినాయక నిమజ్జనం సందర్భంగా స్థానికంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలో కుమారి ఆంటీ పాల్గొన్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ వేలంలో ఆమె పోటీపడి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ సంతోషకరమైన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ లడ్డూ తనకు చాలా ప్రత్యేకమని, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోరిక ఇప్పుడు తీరిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె తన వీడియోలో భావోద్వేగంగా మాట్లాడారు. “నేను హోటల్ ప్రారంభించి 15 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి ప్రతి ఏటా వినాయకుడికి ప్రసాదం సమర్పిస్తున్నాను. గణపయ్యా.. నీ లడ్డూ నాకు ఎప్పుడిస్తావు అని అడుగుతూనే ఉన్నాను. చివరికి ఈ ఏడాది స్వామివారు కరుణించి తన ఆశీర్వాదంగా నాకు ఈ లడ్డూను ఇచ్చారు. జై గణేశా, జై జై గణేశా” అని పేర్కొన్నారు. ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతోంది. ఎంతో మంది నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ లడ్డూను ఎంత మొత్తానికి వేలంలో దక్కించుకున్నారనే విషయాన్ని మాత్రం కుమారి ఆంటీ వెల్లడించలేదు. హైదరాబాద్‌లో హోటల్ నిర్వహిస్తున్న ఆమె, తన స్పెషల్ వంటకాలతో పాటు తనమాటతీరుతో సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిన విషయం తెలిసిందే.

మరిన్ని వీడియోల కోసం :

లగ్జరీ బంగ్లాను ఖాళీ చేసిన స్టార్‌ కపుల్‌.. కారణం తెలిస్తే షాకవుతారు వీడియో

ఏపీ, తెలంగాణలో దసరా సెలవులు ఎప్పటినుంచంటే? వీడియో

‘స్పిరిట్’ పై సందీప్ రెడ్డి అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు వీడియో

ఎంతైనా తల్లితల్లే..పిల్లల కోసం చిరుత ఏం చేసిందంటే? వీడియో