ఆనంద్ మహీంద్రా మనసు దోచుకున్న కుగ్రామం.. ఎక్కడంటే ??

Phani CH

Phani CH |

Updated on: Jul 26, 2022 | 9:01 AM

పచ్చని తేయాకు తోటలతో కనువిందు చేసే కేరళ ప్రాంతం అంటే ఇష్టపడని వారుండరు. తరచూ పర్యాటకులు ఇక్కడికి వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు.

పచ్చని తేయాకు తోటలతో కనువిందు చేసే కేరళ ప్రాంతం అంటే ఇష్టపడని వారుండరు. తరచూ పర్యాటకులు ఇక్కడికి వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు. అలాంటి కేరళలోని వేనాడ్ తేయాకు తోటలకు ఎంతో ప్రసిద్ది చెందింది. ఇక్కడి కొండ ప్రాంతాల అందాలను చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. ఆ అందమైన కొండల మధ్య మధ్య కేరళ పర్యాటక విభాగం కొన్ని గిరిజన గూడేలను నిర్మించింది. వీటితో పర్యాటకులను ఆకర్షించాలన్నది వారి ప్రయత్నం. ఈ గ్రామానికి ఎన్నోర్ అనే పేరు పెట్టారు. కొండల మధ్య 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ గిరిజన గ్రామాన్ని నిర్మించారు. గిరిజనుల ఇళ్లు, వారి జీవన విధానాన్ని పరిచయం చేయడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. అయితే ఇక్కడ పర్యటించే పర్యాటకులకు ఓ భిన్నమైన అనుభూతి కలుగుతుందనడంలో సందేహం లేదు. 2010లో అప్పటి సబ్ కలెక్టర్ ప్రశాంత్ నాయర్ ఈ ప్రాజెక్టుకు పునాది వేయగా.. 2022 జూన్‌లో ఇది పూర్తయింది. స్థానిక గిరిజన తెగలతోనే దీన్ని నిర్మింపజేశారు. ఈ ప్రాజెక్టు అందాలు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కంట్లో పడ్డాయి. ఇంకేముంది ఆయన తన ట్విట్టర్‌కు పనిచెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటికొచ్చిన మహిళా సోల్జర్‌.. తల్లిని చూసి చిన్నోడి రియాక్షన్ చూసి తీరాల్సిందే

పుట్టినరోజు సందర్భంగా కూతురి గిఫ్ట్‌.. ‘మన బిడ్డకు తండ్రి నేను కాదు.. ఇదిగో సాక్ష్యం’

పట్టెడన్నం కోసం సెక్స్‌ వర్కర్లుగా !! ఇదీ శ్రీలంక మహిళల దుస్థితి

రియల్ “లైగర్” ఎప్పుడైనా చూసారా ?? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే

13 పళ్లు రాలగొట్టుకున్న మహిళ !! ఇదెక్కడి పైత్యం

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu