ఇంటికొచ్చిన మహిళా సోల్జర్.. తల్లిని చూసి చిన్నోడి రియాక్షన్ చూసి తీరాల్సిందే
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ మహిళా సైనికులు తమ బిడ్డలు, కుటుంబాన్ని వదిలి శత్రువులను నిలువరిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి కాస్త శాంతిచడం వల్ల కొందరు తిరిగి ఇళ్లకు వెళ్తున్నారు.
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ మహిళా సైనికులు తమ బిడ్డలు, కుటుంబాన్ని వదిలి శత్రువులను నిలువరిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి కాస్త శాంతిచడం వల్ల కొందరు తిరిగి ఇళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆరేళ్ల చిన్నారి చాలా రోజుల తర్వాత తన తల్లి ఇంటికి రావడం చూసి భావోద్వేగానికి లోనయ్యాడు. ఇంటి గేటు వద్దే గోడ చాటున ఆమె కోసం ఎదురు చూశాడు. తల్లి చిన్నారిని దగ్గరగా హగ్ చేసుకున్న ఈ వీడియోను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ సలహాదారు ఆంటోన్ గెరాష్‌చెన్కో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఉక్రెయిన్ ఇప్పుడు పోరాడుతోంది దీనికోసమే అన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చలించిపోయారు. ఈ వీడియోలో పెంపుడు కుక్క కూడా చాలా రోజుల తర్వాత మహిళా సోల్జర్‍ను చూసి తెగ సంబరపడిపోయింది. దానికి కూడా ఒక హగ్ ఇవ్వాల్సింది అని ఓ నెటిజెన్ కామెంట్ పెట్టాడు. మరో వీడియోలో యుద్ధం నుంచి తిరిగి వచ్చిన తండ్రిని చూపించేందుకు ఓ బాలికను కళ్లు మూసి అతని వద్దకు తీసుకెళ్లింది తల్లి. చాలా రోజుల తర్వాత తండ్రిని చూసిన ఆ పాప భావోద్వేగంతో కంటతడి పెట్టుకుంది. తండ్రి కూడా ఆమెను చూసి పట్టరాని ఆనందంలో మునిగిపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పుట్టినరోజు సందర్భంగా కూతురి గిఫ్ట్.. ‘మన బిడ్డకు తండ్రి నేను కాదు.. ఇదిగో సాక్ష్యం’
పట్టెడన్నం కోసం సెక్స్ వర్కర్లుగా !! ఇదీ శ్రీలంక మహిళల దుస్థితి
రియల్ “లైగర్” ఎప్పుడైనా చూసారా ?? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే
13 పళ్లు రాలగొట్టుకున్న మహిళ !! ఇదెక్కడి పైత్యం
చేపలకు ఆహారం వేస్తోన్న చింపాంజీ !! నీది ఎంత పెద్ద మనస్సో భయ్యా
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

