ఫిఫా ప్రపంచకప్ ఫీవర్‌.. మ్యాచ్ చూసేందుకు ఏకంగా ఓ ఇంటి కొనుగోలు !!

|

Nov 25, 2022 | 9:12 AM

కేరళలో ఫిఫా ప్రపంచకప్ ఫీవర్ ఎక్కువైంది. ఖతార్‌లో 2022 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికుల హార్ట్‌బిట్‌ని పెంచుతోంది.

కేరళలో ఫిఫా ప్రపంచకప్ ఫీవర్ ఎక్కువైంది. ఖతార్‌లో 2022 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికుల హార్ట్‌బిట్‌ని పెంచుతోంది. ముఖ్యంగా కేరళలో ఫుట్ బాల్ ప్రేమికులు ఫుట్ బాల్ క్రీడపై తమ ప్రేమాభిమానాన్ని విభిన్న రీతిల్లో చాటుకుంటున్నారు. కొచ్చి జిల్లా ముండక్కముగల్ గ్రామస్తులు ఫుట్‌బాల్‌పై మక్కువతో ఓ ఇంటినే కొనుగోలు చేశారు. అందరూ కలిసి మ్యాచ్‌ను చూసేందుకు వీలుగా 23 లక్షల రూపాయల వ్యయంతో మినీ హాల్‌గా మార్చుకున్నారు. దాదాపు 17 మంది ఫుట్‌బాల్ అభిమానులు కలిసి డబ్బు పెట్టి ఈ భవనాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ఇంట్లో బ్రెజిల్, అర్జెంటీనా, పోర్చుగల్ దేశాల ఆటగాళ్ల చిత్రిలతో పెయింట్ ‌కూడా వేయించారు. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ, పోర్చుగీస్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో,​రొనాల్డోల ఫోటోలను కూడా వారు చిత్రించారు. అంతేకాదు ఇంటి లోపల వివిధ ఫుట్‌బాల్ స్టార్ల కటౌట్‌లను కూడా ఏర్పాటు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అవతార్ 2.. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్స్.. ఒక్కో టికెట్ ధర ఎంతంటే ??

జంబలకడి జారు మిఠాయా పాటతో.. అన్నకు తమ్ముడి బర్త్‌ డే విషెస్

యశోద మూవీకి కోర్టు ఝలక్.. ఒటీటీ రిలీజ్‌ పై స్టే..

Mahesh Babu: “లవ్ యూ నాన్న” మహేష్‌ ఎమోషనల్ లెటర్..

ఎట్టకేలకు ఓటీటీలో కాంతార.. కాని తప్పని కండీషన్ !!

 

Published on: Nov 25, 2022 09:12 AM