AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Video: చెప్పు దొంగ ఈ పాము.. ఎప్పుడైనా మీరు చూశారా.. నీకు కాళ్లు లేవుగా ఏమి చేస్తామంటున్న నెటిజన్లు..

వైరల్ అవుతున్న ఈ  వీడియోలో.. ఒక పెద్ద పాము నోటిలో చెప్పుని పట్టుకుని జరాజరా పాకుతూ వెళ్ళిపోతుంది. మరి పాము ఆ చెప్పుతో ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు కానీ ఈ సీన్ ను మాత్రం నెటిజన్లు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

Snake Video: చెప్పు దొంగ ఈ పాము.. ఎప్పుడైనా మీరు చూశారా.. నీకు కాళ్లు లేవుగా ఏమి చేస్తామంటున్న నెటిజన్లు..
Snake Running With Sandal
Surya Kala
|

Updated on: Nov 25, 2022 | 9:22 AM

Share

గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాలైన పాములు తరచుగా కనిపిస్తాయి. వాటిలో కొన్ని చాలా విషపూరితమైనవి.. కొన్ని విషయం లేని పాములు. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాముల్లో ఎక్కువ పాములు విషపూరితమైనవి కావు. అయినప్పటికీ.. పాము అనే జీవిని చూస్తే చాలు ప్రజలు.. వెంటనే భయంతో పరుగులు తీస్తారు. ప్రస్తుతం పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా నవ్వడం ఖాయం.

వైరల్ అవుతున్న ఈ  వీడియోలో.. ఒక పెద్ద పాము నోటిలో చెప్పుని పట్టుకుని జరాజరా పాకుతూ వెళ్ళిపోతుంది. మరి పాము ఆ చెప్పుతో ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు కానీ ఈ సీన్ ను మాత్రం నెటిజన్లు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వీడియోలో.. ఇటుకల లోపల నుండి ఒక పెద్ద పాము బయటకు వచ్చి .. ఒక ఇంటి వైపుకి వస్తుంది. అయితే ఆ పాముకి ఓ ఇంటి వెలుపల ఒక చెప్పు కనిపించింది. అంతే వెంటనే పాము ఆ చెప్పుని తన నోటితో పట్టుకుని.. చకచకా  పాకుతూ అక్కడ నుంచి పారిపోతుంది. కొంచెం దూరం వెళ్లిన పాము పొదల్లోకి వెళ్లి అక్కడ నుంచి కనిపించకుండా మాయమైపోయింది.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు.. అయితే వైరల్ అవుతున్న వీడియోలో కొంతమంది మహిళలు భోజ్‌పురిలో మాట్లాడుతున్నారు.. దీంతో ఈ ఘటన బీహార్ లేదా తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో జరిగి ఉండవచ్చని ఊహిస్తున్నారు. ఈ ఫన్నీ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఈ పాము ఆ చెప్పుతో ఏమి చేస్తుందో.. నేను ఆశ్చర్యపోతున్నాను. పాముకి కాళ్లు కూడా లేవు అంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు ఈ వీడియోకి.

చెప్పు దొంగ ఈ పాము:

కేవలం 30 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 18 వేల మందికి పైగా చూశారు. వందలాది మంది వీడియోను లైక్ చేసి భిన్నమైన కామెంట్స్ ను చేస్తున్నారు. ఈ పాము చెప్పుల దొంగ అని అంటే.. మరొకొందరు నేను పాము ముక్కులను కత్తిరించానని ఫన్నీ కామెంట్స్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి