జంగిల్ సఫారీలో ఊహించని ఘటన.. బాలుడిపై చిరుత..
ప్రకృతి ప్రేమికులు, జంతు ప్రేమికులు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు జంగిల్ సఫారీకి వెళ్తుంటారు. రోజంతా ఉరుకులు పరుగులతో జీవితం గడిపేవారు కూడా వారాంతంలో కుటుంబంతో కలిసి ఇలాంటి పర్యటనలకు వెళ్తుంటారు. అలా వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని ఘటన ఎదురైంది. సఫారీకి వెళ్లిన పర్యాటకులపై చిరుత దాడి చేసింది.
ఈ ఘటనలో 13 ఏళ్ల బాలుడు గాయపడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. పర్యాటకులకు అడవిలోని జంతువులను చూపిస్తూ షఫారీ వెహికల్ డ్రైవర్ వాహనాన్ని నెమ్మదిగా నడుపుతూ వెళ్తున్నాడు. ఇంతలో వారికి ఓ చిరుతపులి కనిపించింది. చిరుతపులిని చూపిస్తూ డ్రైవర్ ముందుగా తన ముందున్న బొలెరోను నెమ్మదిగా నడుపుతూ వెళ్తున్నాడు. ఇంతలో చిరుత ఊహించని విధంగా ఆ వాహనం వైపు పరుగెత్తుకొచ్చి దాడికి యత్నించింది. డ్రైవర్ వాహనం వేగం పెంచాడు. చిరుతకూడా వేగంగా పరుగెత్తుకొచ్చి వాహనం కిటికీని పట్టుకొని అందులోని వ్యక్తులపై తన పంజాతో దాడిచేసింది. ఈ ఘటనలో వాహనంలోని 13 ఏళ్ల బాలుడు గాయపడ్డాడు. చిరుతపులి దాడి చేయడాన్ని చూసి, డ్రైవర్ కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. కారును చిరుత వెంబడించింది. ఈ దృశ్యాలను ఆ వాహనం వెనుక వెళ్తున్న మరో కారులో కూర్చున్న వ్యక్తులు తమ కెమెరాలో బంధించారు. గాయపడిన బాలుడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. చికిత్స అనంతరం బాలుడు కోలుకున్నాడని డాక్టర్లు తెలిపారు.ఈ వీడియోను ఓ యూజర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరులోని బన్నేర్‌ఘట్ట బయోలాజికల్ పార్క్‌లో ఈ ఘటన జరిగింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మునిగిన ముంబై.. ఆర్థిక రాజధాని అతలాకుతలం
Weather Update: మరో మూడు రోజులు వానలు దంచుడే దంచుడు .. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..
Roopchand Fish: రక్తం రుచి మరిగిన చేప.. ఇతర చేపలకు భిన్నం
పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? అయితే ఇలా చేయండి
ప్రేమించిన అమ్మాయికి ‘బాంబు’ గిఫ్ట్ పార్శిల్ అందుకున్న భర్త.. చివరికి
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

