Jayalalithaa: ఆరేళ్లకు గుర్తొచ్చిందా.? జయలలిత మేనకోడలి పిటిషన్‌పై కోర్టుకు కర్నాటక ప్రభుత్వం.!

|

Mar 29, 2024 | 10:21 PM

దివంగత మాజీ ముఖ్యమంత్రి జె జయలలితకు చెందిన బంగారు, వజ్రాల ఆభరణాలకు తాను హక్కుదారుననీ వాటిని తమిళనాడు ప్రభుత్వానికి కాక తనకు అప్పగించాలని మేనకోడలు దీప జయకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేయాలంటూ కర్నాటక ప్రభుత్వం తాజాగా హైకోర్టును కోరింది. గతంలో జయ నగలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను మార్చి 26 వరకు నిలిపివేస్తూ కర్నాటక హైకోర్టు స్టే ఇచ్చింది.

దివంగత మాజీ ముఖ్యమంత్రి జె జయలలితకు చెందిన బంగారు, వజ్రాల ఆభరణాలకు తాను హక్కుదారుననీ వాటిని తమిళనాడు ప్రభుత్వానికి కాక తనకు అప్పగించాలని మేనకోడలు దీప జయకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేయాలంటూ కర్నాటక ప్రభుత్వం తాజాగా హైకోర్టును కోరింది. గతంలో జయ నగలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను మార్చి 26 వరకు నిలిపివేస్తూ కర్నాటక హైకోర్టు స్టే ఇచ్చింది. జయలలితకు చెందిన 27 కేజీల ఆభరణాలు తనకే వారసత్వంగా అందుతాయంటూ మేనకోడలు దీప జయకుమార్ పిటిషన్‌ వేయడంపై కర్నాటక ప్రభుత్వం సీరియస్ అయింది. ఆరేళ్ల సమయమిస్తే.. ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించింది. 2017 ఫిబ్రవరి నుంచి 2023 జూన్‌ మధ్యకాలంలో నగలను అప్పగించాలని దీప కోరలేదని వాదించింది. అప్పట్లో జయలలిత మేనకోడలు జె దీప దాఖలు చేసిన పిటిషన్‌పై స్టే ఇచ్చింది.

జయలలితపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆభరణాలను కర్నాటక ఆదాయ పన్ను శాఖ స్వాధీనం చేసుకుంది. ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు వీటిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ ప్రారంభం కావలసి ఉంది. జయలలితపై న్యాయ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేసినందున.. ఆమెను ఈ కేసులో నిర్దోషిగా పరిగణించాలని పేర్కొంటూ 2023 జులై 12న ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను దీప సవాలు చేశారు.

20 కేజీల బంగారు, వజ్రాభరణాలను విక్రయించడం లేదా వేలం వేయడం చేయాలని, మిగతా 7 కేజీల బంగారాన్ని ఎలా అమ్మాలన్న విషయమై తమిళనాడు ప్రభుత్వం కార్యాచరణను రూపొందించుకోవచ్చని ప్రత్యేక కోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కర్నాటకలో విచారణ జరిగినందున సాక్ష్యాధారాలన్నీ కర్నాటక ట్రెజరీలో కోర్టు అధీనంలో ఉన్నాయి. జయలలితతో పాటు ఆమె నెచ్చెలి శశికళ, జయలలిత వదులుకున్న పెంపుడు కుమారుడు విఎన్ సుధాకరన్, శశికళ వదిన జె ఇలవరసిపై ప్రత్యేక కోర్టు విచారణ జరిపి వారికి దాదాపు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..